కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘డెవిల్’. పీరియాడికల్ స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ డిసెంబరు 29న విడుదల కానుంది. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించగా, సంయుక్తామీనన్ హీరోయిన్గా నటించారు. మాళవికా నాయర్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అయితే డెవిల్ సినిమా నవీన్ మేడారం దర్శకత్వంతో మొదలైంది. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి అభిషేక్‌నామా స్వీయ దర్శకత్వం అంటూ ‘డెవిల్’ పోస్టర్స్ దర్శనమిచ్చాయి. దీంతో నవీన్ మేడారంను ఈ ‘డెవిల్’ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా తెలిసిపోయింది. మొదట్నుంచి కూడా డెవిల్ సినిమాలో అభిషేక్ నామా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యారంటూ టీమ్ చెప్పుకొచ్చింది. అయితే ఈ వివాదంపై దర్శకుడు నవీన్ మేడారం ఓ బహిరంగలేఖను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. ‘డెవిల్’ సినిమాకు తాను దర్శకుడిగా 105 రోజులు పనిచేశానని, ఓ బిడ్డలా తాను ‘డెవిల్’ సినిమాను ట్రీట్ చేసానని, కేవలం ఈగో, అత్యాల వల్లే తనకు దర్శకత్వం చేసిన క్రెడిట్ దక్కలేదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్ మేడారం. అలాగే తన కొత్త ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తానని కూడా నవీన్ మేడారం చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ను మాత్రం పొగిడారు నవీన్. సో…ఇష్యూ అంతా…నిర్మాత అభిషేక్ నామా, దర్శకుడు నవీన్‌ల మధ్యేనని తెలుస్తోంది. ‘డెవిల్’ సినిమాకు ఎవరు నిజమైన దర్శకుడు? అన్న ప్రశ్నకు కల్యాణ్‌రామ్ కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఈ విషయం గురించి అభిషేక్నామాను అడాల్సిందిగా కళ్యాణ్‌రామ్ మాట దాటేశారు.
#Devil #KalyanRam https://t.co/P8SwD3UG2W
— TollywoodHub (@tollywoodhub8) December 27, 2023