Nikhil Swayambhu: ‘కార్తికేయ 2’తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ హీరో అయిపోయారు నిఖిల్. కానీ గత ఏడాది విడు దలైన నిఖిల్ ‘18 పేజీస్’, ముఖ్యంగా ‘స్పై’ సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి. అయితే స్పై మూవీ షూటింగ్ ను స్పీడ్ చేయడం వల్లే ఈ సినిమా సరిగా ఆడలేదు. భవిష్యత్‌లో తాను చేసే ఏ సినిమా అయినా సరే..షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని నిఖిల్ ఆ సందర్భంలో పేర్కొన్నారు.
అయితే నిఖిల్ చేస్తున్న తాజా సినిమాల్లో ‘స్వయంభూ’ ఒకటి. కాగా ఈ సినిమాలో తాను హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నానని, ఈ సినిమాలో ‘జై శ్రీరామ్’ తన ఫెవరేట్ డైలాగ్ అని నిఖిల్ చెప్పారు. అలాగే ‘స్వయంభూ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, ఈ ఏడాది దీపావళి లేదా దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తామని నిఖిల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. సినిమా షూటింగ్ పూర్తయితేనే కానీ తాను రిలీజ్ విషయాన్ని ప్రకటించనని చెప్పిన నిఖిల్ ఇప్పుడు మాట మార్చాడు.
Devil: ఈగో వల్లే దర్శకుడిగా క్రెడిట్ ఇవ్వడం లేదు
స్వయంభూ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే ఈ సినిమా రిలీజ్ విషయాన్ని ప్రస్తావించాడు. ఇక ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నితిన్ వియత్నాంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. పిక్సెల్ స్టూడియోస్‌పై శ్రీకర్, భువన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండ
రామ్‌చరణ్ నిర్మిస్తున్న ‘ది ఇండియన్ హౌస్’, ‘కార్తికేయ 3’, సుధీర్‌వర్మతో ఓ సినిమాకు కమిటైయ్యారు నిఖిల్.