Game Changer: దర్శకుడు శంకర్‌పై రామ్‌చరణ్ (Ramcharan) ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. సోషల్‌మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు చరణ్ ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి, అభ్యంతరకరమైన కామెంట్స్ పెడుతున్నారు.కానీ దర్శకుడు శంకర్ మాత్రం సైలెంట్‌గా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ‘గేమ్‌చేంజర్’(Game Changer) విషయంలో శంకర్(Shankar)కు వేరే ప్లాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటివి అంటే…ప్రజెంట్ కమల్హాసనతో ‘ఇండియన్ 2’ చేస్తున్నారు శంకర్. సడన్‌గా ‘ఇండియన్ 3’ తెరపైకి వచ్చింది. కట్ చేస్తే.. మరో ఎనిమిది నెలలలోపు ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాలు విడుదల కావొచ్చు అనే టాక్ తెరపైకి వచ్చింది. సేమ్ స్ట్రాటజీని ‘గేమ్‌చేంజర్’ విషయంలో కూడా శంకర్ పాటిస్తున్నట్లుగా తెలిసింది. అవును… ‘గేమ్‌చేంజర్’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట శంకర్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ‘దిల్’ రాజు కూడా శంకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ముందు ‘ఇండియన్ 2’ని రిలీజ్ పనుల్లో ఉన్నారు శంకర్. ఆ తర్వాత ‘ఇండియన్ 3’ ఉంటుంది. ఈ నెక్ట్స్ ‘గేమ్‌చేంజర్’ రెండు పార్టులుగా వస్తుందని తెలిసింది.
ఇక గేమ్‌చేంజర్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఫిబ్రవరిలో రెండో వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఒక చరణ్బర్త్ డే సందర్భంగా మార్చి 27న ‘గేమ్‌చేంజర్’ టీజర్ రిలీజ్ కానుందని తెలిసింది.కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నవీన్‌చంద్ర,సునీల్, జయరాం, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.