Jaragandi Song: మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ రోజున ‘గేమ్‌చేంజర్’ సినిమా నుంచి ‘జాబిలమ్మా వస్తుంది జరగండి’(Jaragandi Song) అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయాలని చిత్రంయూనిట్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఈ పాటను మేజర్‌గా న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట(Jaragandi Song) ఖర్చు 15 కోట్ల రూపాయలైందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం దర్శకుడు శంకర్‌కు లావిష్ పాటలకు తీయడం కొత్త ఏం కాదు. ‘రోబో 2.ఓ’ కోసం శంకర్ 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రజనీకాంత్, ఆమీజాక్సన్ల మధ్య పిక్చరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే లావిష్ విజువల్స్‌తో ‘జరగండి’ పాట ఉంటుందట. రామ్‌చరణ్‌తో ‘వినయవిధేయరామ’ సినిమాలో జోడీగా నటించిన హీరోయిన్ కియారాఅద్వానీయే ‘గేమ్‌చేంజర్’లోనూ హీరోయిన్గా నటిం చారు.
నిజానికి ‘జరగండి’ పాటను గత ఏడాది దీపావళికి అంటే నవంబరు12న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇదే జరగండి పాట అంటూ ఆన్లైన్లో ఓ సాంగ్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంపై చిత్రంయూనిట్ ఏం స్పందించలేదు. రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ‘జరగండి’ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పుడు ప్లాన్ చేశారు. ఇక ‘గేమ్‌చేంజర్’ సినిమా డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఎస్జే సూర్య, సునీల్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, అంజలి ఇతర పాత్రలు పోషి స్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్ చేస్తున్నారు తండ్రీకొడుకులుగా. ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? అన్నదే ‘గేమ్‌చేంజర్’ ఇతివృత్తమని సమాచారం. అలాగే రాజకీయాల్లో తండ్రికి జరిగినఅన్యాయానికి రామ్నందన్ ఎలా పగ తీర్చుకుంటున్నాడు? అనేది మరో కోణం అట.
ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 3’ తీస్తున్నారు శంకర్ చెన్నైలో. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే రామ్ చరణ్ ‘గేమ్‌చేంజర్’ షూటింగ్లో పాల్గొంటారు. మార్చి 15 నుంచి గేమ్‌చేంజర్ కొత్త షెడ్యూల్ ఉంటే అవకాశాలు ఉన్నాయి. వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మేజర్ షెడ్యూల్ ముగింది. ఇక ‘గేమ్‌చేంజర్’ సినిమాకు తమన్ స్వరకర్త.
రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన మరో చిత్రం అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా కమిటైయ్యారు రామ్‌చరణ్. జాన్వీకపూర్ హీరోయిన్ ఈ సినిమాలో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ ఏడాది వేసవిలో సినిమాను చిత్రీకరించాలని అనుకుంటున్నారు.