Gamechanger Release: రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ (Gamechanger) సినిమా విషయంలో మెగాఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ‘గేమ్‌చేంజర్’ సినిమా రిలీజ్ (Gamechanger Release) ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే వస్తోంది. ఈచిత్రం దర్శకుడు శంకర్. కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’, రామ్‌చరణ్‌తో ‘గేమ్‌చేంజర్’.. ఇలా మూడు సినిమాల చిత్రీకరణలను ఒకేసారి చేస్తున్నారు శంకర్. ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలషూటింగ్స్లనే ముందుగా కంప్లీట్ చేసేందుకు దర్శకుడు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతోరామ్చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా ఆటోమేటిక్‌గా వాయిదా పడుతూనే వస్తోంది. ‘గేమ్‌చేంజర్’ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత 2024 వేసవికి ప్లాన్ చేశారు. ఆ నెక్ట్స్ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సెప్టెంబరులో ఉండొచ్చని ఈ చిత్రం నిర్మాత ‘దిల్ ’ రాజు చెప్పారు. దీంతో అందరూ ‘గేమ్‌చేంజర్’ సినిమా విడుదల సెప్టెంబరులోనే ఉంటుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సెప్టెంబరు 27న పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో ‘గేమ్‌చేంజర్’ వాయిదా పడాల్సిన పరిస్థితి. ఇక తాజాగా ‘గేమ్‌చేంజర్’ సినిమా 2024 డిసెంబరులో విడుదల అవుతుందనే టాక్వినిపిస్తోంది. ఇది కన్ఫార్మ్ కాదు. ఇప్పటికీ ప్రచారంలో ఉన్న మాట మాత్రమే.
ఇక ‘గేమ్‌చేంజర్’ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలైంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్లో నటిస్తారు. తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తారు.
RamcharanRC16:రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్…కన్ఫార్మ్ చేసిన బోనీకపూర్
కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్సే సూర్య, సునీల్, జయరాం, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘గేమ్‌చేంజర్’ సినిమాలోని ‘జరగండి’ పాట లిరికల్ వీడియో రిలీజ్ వాయిదా పడ్డ సంగ తి తెలిసిందే. ఈ పాట రిలీజ్‌ను గురించిన అప్డేట్ త్వరలోనే రానుందని తెలిసింది.