ThugLife: ‘నాయకన్’(తెలుగులో ‘నాయకుడు’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు మణిరత్నం, కమల్‌హాసన్ కాం బోలో 37 సంవత్సరాల తర్వాత రూపొందుతున్న సినిమా ‘థగ్‌లైఫ్’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కకుతోంది. ‘జయం’ రవి, త్రిష, దుల్కర్సల్మాన్, జోజూ జార్జ్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్యలక్ష్మీ ఈ సినిమాలో కీలక పాత్రలు చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తప్పుకున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికన్న ఈ సినిమా చిత్రీకరణ మెల్లిగా సాగుతోందట. కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాలుకే ఎక్కువ టైమ్కేటాయిస్తున్నారట ప్రజెంట్. దీంతో కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక దుల్కర్సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పు కున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ.ఏ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకుస్వరకర్త.
హీరోగా ప్రస్తుతం ‘లక్కీభాస్కర్’, ‘కాంత’ సినిమాలతో పాటుగా మలయాళంలో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు దుల్కర్సల్మాన్. ‘హనుమాన్’ ఫేమ్ తేజా సజ్జా నెక్ట్స్ ఫిల్మ్ ‘మిరాయి’లోనూ దుల్కర్ ఓ కీరోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సూర్య–సుధాకొంగర కాంబినేషన్లోని లేటెస్ట్ ఫిల్మ్‌లో దుల్కర్ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ, బాబీ కాంబోలోని తెలుగు సినిమాలోనూ దుల్కర్ ఓ లీడ్ రోల్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయి తే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.