ThugLife: కమల్‌హాసన్ కెరీర్లో నాయకన్(తెలుగులో ‘నాయకుడు’) సూపర్‌హిట్. మణిరత్నం దర్శకుడు. 1987లో ఈ సినిమా విడుదలైంది. అయితే నాయకన్ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత కమల్ – మణి రత్నం కాంబోలోని నెక్ట్స్ ఫిల్మ్ రావడానికి 37 సంవత్సరాలు పట్టింది. కమల్‌హాసన్ – మణి రత్నం ప్రజెంట్ ‘థగ్ లైఫ్’ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రానున్న ఈ సినిమా ఇది. ఇందులో త్రిష, దుల్కర్సల్మాన్, ‘జయం’ రవి, గౌతమ్ కార్తీక్, జోజా జార్జ్, ఐశ్వర్యలక్ష్మీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కమల్ కెరీర్లో 234వ సినిమా అయిన ఈ ‘థగ్‌లైఫ్’ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. కమల్‌హాసన్ పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరి స్తున్నారు మేకర్స్.
ఏఆర్ రెహామాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కమల్‌హాసన్ – మణి రత్నం – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లోని తొలి మూవీ ఇదే. వీలైతే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారట మణిరత్నం. ఇక కమల్‌హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రం కాక కమల్‌హాసన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివులను దర్శకులుగా పరిచయం చేస్తూ, ఓ సినిమా చేయనున్నారు.