Trivikram: ‘గుంటూరుకారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా ఎవరు నటిస్తారు? అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. నాని, వెంకటేష్,విజయ్‌దేవరకొండ, రానా…ఇలా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. నిజానికి ‘గుంటూరుకారం’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలి త్రివిక్రమ్. కానీ అల్లుఅర్జున్‌కు వేరే ప్లాన్స్ ఉండటం, ‘గుంటూరుకారం’ నెగటివ్ రిజల్ట్ వంటి కారణాలతో ఈ సినిమా స్టార్ట్ కావడానికి కాస్త సమయం ఉంది. మరోవైపు కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. నెక్ట్స్ ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయాలి ఎన్టీఆర్. కానీ ప్రశాంత్‌నీల్ వెంటనేప్రభాస్తో ‘సలార్ 2’ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దీంతో ఎన్టీఆర్‌కు కాస్త ఖాళీ దొరికింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారట. పైగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘అరవిందసమేత వీరరాఘవ’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ‘అరవిందసమేత’ తర్వాత త్రివిక్రమ్‌తోనే ఓ సినిమా స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. కానీ ఈ సినిమా అప్పట్లో క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
Trivikram: త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఫిక్స్?
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘అరవిందసమేత వీరరాఘవ’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అరవిందసమేత’ తర్వాత త్రివిక్రమ్‌తోనే ఓ సినిమా స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. కానీ ఈ సినిమా అప్పట్లో క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
Leave a comment
Leave a comment