Kamalhaasan indian2: కమల్‌హాసన్ కెరీర్లో ‘ఇండియన్’(తెలుగులో ‘భారతీయుడు’) బ్లాక్‌బస్టర్. శంకర్ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం నిర్మించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. తమిళ సినీ పరిశ్రను మరో మెట్టుపై నిలబెట్టింది. అయితే ‘ఇండియన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన శంకర్‌తో మళ్లీ కలిసి పని చేయడానికి కమల్‌కు పాతికే సంవత్సరాలు పట్టింది. రజనీకాంత్‌తో ‘రోబో’ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ కెరీర్ యావరేజ్‌గానే సాగింది. విజయ్‌తో శంకర్ తీసిన ‘నన్బన్’ (తెలుగులో ‘స్నేహితుడు’గా విడుదలైంది), విక్రమ్‌తో తీసిన ‘ఐ’(తెలుగులో ‘మనోహరుడు’ గా విడుదలైంది) విడుదలైయ్యాయి, కానీ శంకర్ బ్లాక్‌బస్టర్ స్థాయిని కొనసాగించలేకపోయాయి. ఇటు కమల్ కెరీర్ కూడా సాఫీగా లేదు. ఈ సమయంలో శంకర్‌కు ‘ఇండియన్’ గుర్తొచ్చాడు. రజనీతో ‘2.ఓ’ షూటింగ్‌ను 2017 ఆగస్టులో పూర్తి చేసిన శంకర్, నెక్ట్స్ మంత్ సెప్టెంబరులో ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’(indian 2) ను అనౌన్స్ చేశారు.
మారిన నిర్మాత
‘ఇండియన్ 2’ సినిమాను కమల్‌హాసన్(Kamalhaasan) తో శంకర్ ప్రకటించగానే, ‘ఇండియన్’నునిర్మించిన ఏఏమ్ రత్నంయే ‘ఇండియన్ 2’ను కూడా నిర్మిస్తారని అందరూ ఊహిం చారు. కట్ చేస్తే…టాలీవుడ్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు (Dil Raju) పేరు తెరపైకి వచ్చింది. తక్కువసమయంలోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 200 కోట్ల రూపాయాల బడ్జెట్ అన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై య్యా యి. కానీ ఇంతలోనే స్పీడ్ బ్రేకర్. ‘దిల్’ రాజు ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. శంకర్ డైలామాలో పడ్డారు. నిర్మాతగా ఏఎమ్ రత్నం పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ సీన్లోకి వచ్చింది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత సుభా స్కరన్..‘ఇండియన్ 2’ సెట్.
సెట్స్‌లో పెద్ద ప్రమాదం
‘ఇండియన్ 2’ అనౌన్స్మెంట్ వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత అంటే 2019లో ‘ఇండియన్ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. ఇలా ఏడాది గడిచిందో లేదో అలా ‘ఇండి యన్ 2’ సెట్స్‌లో 2020 ఫిబ్రవరిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో సహా, నలుగురు క్రూ మెంబర్స్ ఈ ఘటనలో చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘ఇండియన్ 2’ మూవీ ఆఫ్ సెట్ స్టోరీ శంకర్ స్క్రీన్ ప్లే స్టైల్లో సాగింది.
కోర్టు కేసులు
‘ఇండియన్ 2’ బడ్జెట్ ఇష్యూస్‌తో ఆగిపోయింది. అయితే ఈ లోపు రామ్‌చరణ్‌తో శంకర్ ‘గేమ్‌చేంజర్’ సినిమాను ప్రకటించారు. ‘దిల్’ రాజు నిర్మాత. తన దర్శకత్వం
లోని ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రణ్‌వీర్‌సింగ్‌ను ఎంచుకున్నారు శంకర్. దీంతో లైకా ప్రొడక్షన్స్‌కు కోపం వచ్చింది. ‘ఇండియన్ 2’ సినిమానుపూర్తి చేయకుండ, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను శంకర్ టేకాఫ్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తేశంకర్ తమకు 150 కోట్ల రూపాయలను ఇవ్వాలన్నట్లుగా కోర్టుకు వెళ్లారు లైకా ప్రతినిథులు. శంకర్ కూడా తగ్గలేదు. దీంతో శంకర్‌కు, లైకాకు మధ్య కమల్‌హాసన్ వారధిఅయ్యారు. మొత్తానికి ‘ఇండియన్ 2’ అప్పటికీ ఓకే. కానీ ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్‌లో భాగమైంది. అంతే..ఇక ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ఆగలేదు. ఒకవైపు ‘ఇండియన్ 2’ను పూర్తి చేస్తూనే, ‘గేమ్‌చేంజర్’ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేశారు శంకర్. ఇక రణ్‌వీర్‌సింగ్‌తో శంకర్ చేస్తానన్న అపరిచితుడు హిందీ రీమేక్, ఆ చిత్ర అసలు నిర్మాత రీమేక్ హక్కుల విషయంలో కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయింది.
ఇలా ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ పూర్తయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, సిద్దార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు. 2024 వేసవిలో రిలీజ్ కానుంది. ఇండియన్ 2కు సీక్వెల్‌గా ఇండియన్ 3 తీస్తున్నారు. రామ్‌చరణ్‌తో గేమ్‌చేంజర్ పూర్తి కాగానే ఇండియన్ 3పై మరింత ఫోకస్ పెడతారు శంకర్.