కమల్‌హాసన్ (Kamalhaasan2024) నటించిన రెండు సినిమాలు పదిహేను రోజుల గ్యాప్‌లో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. 1996లో దర్శకుడు శంకర్‌తో కలిసి కమల్‌హాసన్ ‘ఇండియన్’ సినిమా తీశారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్. పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 తీస్తున్నారు శంకర్, కమల్‌హాసన్. ఈ సినిమా ఈ ఏడాది మే 24న విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. సుభాస్కరన్, ఉధయనిధిస్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, ప్రియభావనీశంకర్లు కీలక పాత్రలు పోషించారు.
మరోవైపు కమల్‌హాసన్ ఓ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కాగా, దీపికాపదుకొనె, దిశాపటానీ, అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రధారులు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 09న విడుదల కానుంది.
ఇలా.. పదిహేను రోజుల గ్యాప్‌లో కమల్‌హాసన్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇవికాక కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ సినిమా చేస్తున్నారు దర్శకుడు మణిరత్నంతో. అలాగే కేజీఎఫ్ స్టంట్కొరియోగ్రాఫర్స్ అన్బుఅరవిలతో కమల్‌హాసన్ హీరోగా ఓ సినిమా చేస్తారు.