War2: తెలుగులో గూఢచారి సినిమాలు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా హిట్ కాలేదు. ఏందుకో స్పై రోల్ అంటే మాత్రం టాలీవుడ్ హీరోలకు కలిసి రావడం లేదు. అఖిల్ ‘ఏజెంట్’, నిఖిల్ ‘స్పై’, కళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమాలు సూపర్ హిట్ కాలేకపోయాయి. డెవిల్ కాస్త ఫర్వాలేదనిపించినా…రాంగ్ రిలీజ్ డేట్ కాస్త దెబ్బతీసింది. ఈ తరు ణంలో ఎన్టీఆర్ స్పైగా కనిపించనున్నారు హిందీ చిత్రం ‘వార్ 2’లో (War2). మరి… ఇండి యన్ స్పైగా ఎన్టీఆర్ హిట్ అవుతారా? లేదా అనేది చూడాలి.
Vijaydevarakonda: విజయ్‌దేవరకొండకు లైన్ క్లియర్ చేసిన ఎన్టీఆర్
హృతిక్‌రోషన్ హీరోగా చేస్తే…ఆల్మోస్ట్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఎన్టీఆర్ స్పైగా కనిపిస్తారు ‘వార్ 2’లో. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ నెలలోనే ‘వార్ 2’ సినిమా జపాన్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. తొలుత హృతిక్‌రోషన్ పాల్గొనగా, ఓ యాక్షన్ సీన్స్‌ను తీస్తారు అయాన్‌ముఖర్జీ. ఆ నెక్ట్స్ ఏప్రిల్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు ఈ సినిమా షూటింగ్లో. యశ్‌రాజ్ ఫిలింస్ యానీవర్స్లో తెరకెక్కనున్న తాజా స్పై చిత్రం ‘వార్ 2’. ‘వార్’లో హృతిక్‌రోషన్, టైగర్ష్రాప్లు హీరోలుగా నటించగా, ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్‌రోషన్‌లు నటిస్తున్నారు. ‘వార్ 1’కు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్. వార్ 2 అయాన్‌ముఖర్జీ డైరెక్టర్. చెప్పాలంటే..ఆయాన్ ముఖర్జీకి స్పై ఫిల్మ్ తీయడం ఇదే తొలిసారి. ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాను తొలుత 2025 రిపబ్లిక్ డే సందర్భంగా ప్లాన్ చేశారు రిలీజ్‌ని. ఆ తరవాత ఆగస్టు, 2025కు వాయిదా వేశారు. అన్నట్లు…వైఆర్ఎఫ్లోనే ఓ ్రçస్టయిట్ హిందీ ఫిల్మ్ ను హీరోగా చేసేందుకు ఎన్టీఆర్ కమిట్మెంట్ ఇచ్చారని బాలీవుడ్ టాక్.
NTR Devara: దేవర ముందు ఎన్నో అడ్డంకులు
ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిపార్టు దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. మలిపార్టు 2025 చివర్లో ఉండొచ్చు. అలాగే ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాల దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారు.