Vijaydevarakonda: ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా తొలిభాగం ‘దేవర పార్టు 1’ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఈ ఏడాది సెంకండాఫ్‌కి వెళ్లుంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుందని తెలిసింది. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో విజయ్‌దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరో యిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లుగా తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా….గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం చేయనున్నారు విజయ్‌దేవరకొండ. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
Vijaydevarakonda: రెండేళ్లకొకసారి పెళ్లి చేస్తున్నారు: విజయ్‌దేవరకొండ