మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పెళ్లిని గురించి మాట్లాడారు.
పెళ్లి విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. చిన్న కుటుంబలో అయినా, పెద్ద కుటుంబంలో అయినా పెళ్లి అనేది చిన్న విషయం కాదు. రిచ్ ఫ్యామిలీస్లోనైనా, పూర్ ఫ్యామిలీస్లోనైనా పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. జీవితాంతం బాగుండాలనే పెళ్లి చేసు కుంటారు అందరు. ఏలాగూ ఏడాదిలో విడిపోతాం కదా అని హ్యాపీగా ఎవరూ పెళ్లి చేసుకోరు.. అంత ఖర్చుపెట్టి. రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఉదయ్‌పూర్‌లో మ్యారేజ్ అయినా ఇంకో సంవ త్సరంలో విడిపోతాం అని ఎవరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి అయినా, రిలేషన్షిప్ అయినా ఏదైనా.. ఓ మంచి ఆశతోనే మొదలవుతుంది. కానీ అనుకున్నట్లుగా కొన్ని విషయాలు జరగలేదు. విడాకులు తీసుకున్నప్పుడు, విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు నన్ను చాలా మాటలు అన్నారు. కొందరు నా క్యారెక్టర్‌ను తప్పు పట్టారు. కుటుంబాన్ని దూషించారు. అప్పుడు తట్టుకోలేకపోయాను’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు నిహారిక కొణిదెల. ఇక చైతన్యతో 2020లో ఏడడుగులు వేశారు నిహారిక కొణిదెల.
ఈ తర్వాత పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా ఈ విషయంపై మౌనంగా ఉన్న, నిహారిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు.