Prabhas: ‘బాహుబలి’ సినిమా కోసం ఐదేళ్లు సమయం కేటాయించాడు ప్రభాస్. ఆ సమయం ప్రభాస్ కెరీర్‌కు పీక్. అయినా ఓపిగ్గా వర్క్ చేశాడు ప్రభాస్. ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్. కానీ ఈ సినిమా విజయం, ప్రభాస్ తర్వాతి సినిమాల అంచనాలను పెంచేశాయి. పాన్ ఇండియా మార్కెట్ అంటూ ఇతరభాషల్లో రిలీజ్ చేయడం, క్వాలిటీ పరంగా బడ్జెట్ పెరగడం వంటివి ప్రభాస్ సినిమాలకు థియేటర్స్‌కు వచ్చేందుకు ఆలస్యమైయ్యేలా కారణమైయ్యాయి. కానీ ఇలా చేసిన ఏ సినిమాలు వర్కౌట్ కాలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘ఆదిపురుష్’ సినిమా సమయంలో ప్రభాస్ వారి ఫ్యాన్స్‌కు ఓ ప్రామిస్
చేశాడు. ఏంటంటే…ఇక నుంచి ఏడాదికి కనీసం కనీసం రెండు, వీలైతే మూడు సినిమాలను థియేటర్స్‌లోకి తీసుకువస్తానని మాట ఇచ్చాడు ప్రభాస్. చెప్పినట్లే….2023లో ‘ఆదిపురుష్’, ‘సలార్:సీజ్ఫైర్’ సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది అంటే 2024లో ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్’, వీలైతే ‘సలార్ 2’ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 2025లో సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్ చేస్తున్న ‘స్పిరిట్’, హనురాఘవపూడితో ప్రభాస్ చేయాల్సిన సినిమాలు విడుదల అవుతాయి. ఈ లోపు కొత్త లైనప్‌ను సెట్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా వరుస సినిమాలు చేయడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. అలాగే ఆడియన్స్‌కు ప్రభాస్ వంతు వినోదం కూడా అందుతుంది.