Vijaydevarakonda: టాలీవుడ్లో విజయ్‌దేవరకొండ ఓ సంచలనం. ‘పెళ్లిచూపులు’ సినిమాతో యాక్టర్‌గా పాపులర్ అయ్యాడు (Vijaydevarakonda). ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ‘టాక్సీవాలా’తో ఫర్వాలేదనిపించుకున్నాడు. ‘గీతగోవిందం’ సినిమాతో వందకోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన హీరోల జాబితా చేరిపోయాడు.
TollywoodHero: బాలీవుడ్ డెబ్యూ..అట్టర్ ఫ్లాప్!
కానీ ఇదంతా గతం….ఇటీవలి కాలంలో విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేదని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’, మరీ ముఖ్యంగా ‘లైగర్’ సినిమాల ఫలితాలు విజయ్‌దేవరకొండను నిరాశపరచాయి. ఇటీవల రిలీజైన ‘ఫ్యామిలీస్టార్’ సినిమాపై విజయ్‌దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ విజయ్ ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్‌ను ‘ఫ్యామిలీస్టార్’ ఇవ్వలేకపోయింది. పైగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా.
ఇంకా మొదలు కాని కొత్త సినిమా?
ప్రస్తుతం విజయ్ హీరోగా ఏ సినిమా సెట్స్‌పై లేకపోవడం ఆయన అభిమానులను బాధపెడుతున్న అంశం. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్‌దేవరకొండ ఓ సినిమా చేయాలి. కానీ ఈ మూవీకి భారీ బడ్జెట్ కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ బాక్సాఫీస్ మార్కెట్, ‘లైగర్’, ‘ఫ్యామిలీస్టార్’ బాక్సాఫీస్ లెక్కలు, గౌతమ్ తిన్ననూరి బాక్సాఫీస్ స్టామినాలను అంచనా వేసుకున్నారట మేకర్స్. దీంతో ఇపాటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు.
Telugu Directors mythological Derams: మైథాలజీ కలలు
విజయ్ మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో?
‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్, ‘రాజావారురాణివారు’ ఫేమ్ కోల రవికిరణ్‌లు విజయ్ దేవరకొండకు కథలు వినిపించినట్లుగా వార్తలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలకు ‘దిల్’ రాజు నిర్మాణంచేయాల్సిందట. కానీ ‘ఫ్యామిలీస్టార్’ బాక్సాఫీస్ రిజల్ట్ కారణంగా ఈ సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అలాగే విజయ్‌దేవరకొండ– సుకుమార్‌ల కాంబినేషన్ మూవీ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అనే అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. ఒకవేళ ఉన్నా…ఈ కాంబినేషన్ ఇప్పట్లో
అయితే కుదిరే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజెంట్ సుకుమార్‌కు ఉన్న టాప్ హీరోల కమిట్మెంట్స్ అలాంటివి.
అయితే ఇలా వరుస వైఫల్యాల తర్వాత తిరిగి పుంజుకుని వెంటవెంటనే బ్లాక్‌బస్టర్స్ కొట్టిన హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఓ ఉదాహరణగా…. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రిజల్ట్ తేడా కొట్టిన తర్వాత అల్లు అర్జున్ నుంచి మరో సినిమా ప్రకటన రావడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ‘అల.. వైకుంఠపురములో…’ సినిమా చేసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ వెంటనే ..‘పుష్ప’గా రెచ్చిపోతున్నాడు. అలాగే సందీప్‌రెడ్డి వంగా, త్రివిక్రమ్‌లతో కొత్త సినిమాలను ప్రకటించి, ఆల్రెడీ స్ట్రాంగ్ లైనప్‌ను రెడీ చేసుకున్నాడు. ఇలా తిరిగి పుంజుకున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. ఇలా విజయ్‌దేవరకొండ కూడా కథల ఎంపికలో జాగ్రత్త పడి, తిరిగి పుంజుకుని మరింత స్టార్స్టేటస్ను రాబట్టుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?
రణ్‌వీర్‌సింగ్ ది సేమ్ పరిస్థితి
ఇటు బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్ కూడా ఇలాంటి బ్యాడ్ఫేజ్నే ఎదురుకుంటున్నాడు. ఫర్హాన్ అక్తర్‌తో రణ్‌వీర్‌సింగ్ చేయాల్సిన ‘డాన్ 3’ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. తమిళ దర్శకుడు శంకర్‌తో రణ్‌వీర్‌సింగ్ కమిటైన ‘అన్నియాన్’(తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా హిందీ రీమేక్ ఇప్పట్లో మొదలైయ్యేలా లేదు. ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో వివాదం నడుస్తోంది. హీరో రణ్‌వీర్‌సింగ్– ఆదిత్యాథార్లు ఓయాక్షన్ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాపై సరైన స్పష్టత లేదు. రణ్‌వీర్‌సింగ్– ప్రశాంత్వర్మల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
Ranveer Singh Shaktimaan: శక్తిమాన్‌గా రణ్‌వీర్‌సింగ్ పనికిరాడు!
అలాగే ప్రముఖ సోనీ సంస్థ రణ్‌వీర్‌సింగ్‌తో సూపర్‌హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్’ చేయాలనుకుంది. ఈ చిత్రం కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. ఇలా ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్ హీరోగా చేస్తున్న ఏ సినిమా సెట్స్‌పై లేకపోవడం గమనార్హం. రణ్‌వీర్‌సింగ్ ఓ లీడ్ లో నటించిన ‘సింగమ్ ఎగైన్’ మాత్రం ఈ ఏడాది రిలీజ్ అవుతుంది. కానీ రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్‌దేవగన్ మెయిన్ హీరో.
Ranveer And Deepika: దీపికా పదుకొనె…ఇకపై దీపికమ్మ
డిఫరెంట్ యాటిట్యూడ్, ఎగ్రెసివ్ ప్రెజెన్స్, ట్రెండీ లుక్స్, బోల్డ్ అన్సర్స్…ఇలా కొన్ని కామన్ క్వాలీటీస్ ఉన్న రణ్‌బీర్‌కపూర్, విజయ్దేవరకొండలకు ఒకే టైమ్‌లో ఒక్క సినిమా కూడా సెట్స్‌పై లేకపోవడం ఆశ్చర్య
కరంగా అనిపిస్తుంది సినీ లవర్స్‌కు.