Telugu Directors mythological Derams:
రాజమౌళి మహాభారతం
తెలుగు సినిమాను ప్రపంచవేదికపై నిలబెట్టిన ఖ్యాతి దర్శకుడు రాజమౌళిది. తెలుగు సినిమా మార్కెట్‌ను ‘బాహుబలి’ అంత చూపి, తెలుగులో సినిమాలో ఆ సత్తా ఉందని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదే ‘మహాభారతం’. మహాభారతం ఇతీహాసం ఆధారంగాతీయాలనే ఆకాంక్ష తనకు ఉన్నట్లుగా రాజమౌళి పలుసందర్భాల్లో చెప్పుకొచ్చారు. (Telugu Directors mythological Derams)
తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయి న ‘మహాభారతం’ తన చివరి ప్రాజెక్ట్ కూడా కావొచ్చనట్లుగా రాజమౌళి మాట్లాడిన సందర్భాలు కూడాఉన్నాయి. మరి..రాజమౌళి తన కలను ఎప్పటికీ సాకారం చేసుకుంటారో చూడాలి మరి…!. రాజమౌళి వంటి విజనరీ దర్శకుడు ‘మహాభారతం’ను ఓ ట్రయాలజీగా తీస్తే అది అదిరిపోతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
హిరణ్యకశ్యప
త్రివిక్రమ్ రచనల్లో, దర్శకత్వ శైలిలో ఇతీహాసాల రిఫరెన్స్‌లు, పంచ్‌లు బాగానే ప్రతిధ్వనిస్తుంటాయి. స్వహతగా రచయిత అయిన త్రివిక్రమ్‌కు ఇతీహాసాలంటే మక్కువ ఎక్కువ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక రానా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’. ఈ సినిమాకు ఇప్పుడు త్రివిక్రమ్ రచయితగా పని చేస్తున్నారు.
తొలుత ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. కానీ ఇటీవల కామిక్‌కాన్ ఈవెంట్లో ఈ సినిమాను ప్రకటించిన రానా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచయిత అని చెప్పారు కానీ, గుణశేఖర్‌ను దర్శకుడిగా మరోసారి కన్ఫార్మ్ చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా గుణశేఖర్ తప్పుకున్నట్లే. పైగా గుణశేఖర్ అప్పట్లో సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్….‘హిరణ్యకశ్యప’ సినిమా నుంచి దర్శకుడిగా గుణశేఖర్ తప్పుకున్నట్లు స్పష్టం చేస్తోంది.
Allu Arjun-Trivikram Srinivas: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లోని నాలుగో సినిమా
మరోవైపు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల. .వైకుంఠపు రములో..’ సినిమాల తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో మైథలాజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
మరో మైథాలజీ ప్రాజెక్ట్
‘రుద్రమదేవి’ సినిమాను అనుష్కాశెట్టితో తీసి భళా అనిపించారు గుణశేఖర్. కానీ సమంతతో గుణశేఖర్ చేసిన మైథలాజీ సినిమా ‘శాకుంతలం’ ప్రేక్షకులకు ఎందుకో నచ్చలేదు. దీంతో ఎలాగైన ఇదే జానర్లో మరో సినిమా చేసి, హిట్ కొట్టాలని గుణశేఖర్ ఫిక్స్ అయినట్లు, ఇందుకోసం కొత్తగా ఆయన ఓ కథను రెడీ చేస్తున్నట్లుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వస్తున్నాయి.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?
ప్రశాంత్‌నీల్ రావణం
దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెలుగువాడే. రాయలసీమ వాసి. కానీ ప్రశాంత్‌నీల్ తాతలు కన్నడకు వలస వెళ్లారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతోనే ప్రశాంత్‌నీల్ చాలా మందికి తెలుసు. కానీ ప్రశాంత్‌నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది.
Prabhas Ravanam: రవణం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు
అదే ‘రావణం’. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌ను ‘దిల్’ రాజు ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేసినట్లుగా వార్తలు ఉన్నాయి. కమర్షియల్ మీటర్‌ను బాగా హ్యాండిల్ చేయగల ప్రశాంత్‌నీల్ మైథలాజీని ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తి ఆడియన్స్‌లోనూ ఉంటుంది.
కల్కి2898ఏడీ
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ‘కల్కి 2898ఏడీ’ సినిమాను గురించే. ఈ చిత్రం దర్శకుడు నాగ్అశ్విన్. మైథలాజీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ ఇది. మహా భారతం నుంచి ఈ సినిమా కథ మొదలవుతుందని నాగ్అశ్విన్ ఆల్రెడీ చెప్పారు.
అయితే ఈ సినిమాలో మహాభారతం, ద్వాపరయుగం, 2898ఏడీ కాలంనాటి ఊహాత్మాక పరిస్థితులును నాగ్అశ్విన్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితా»Œ æబచ్చన్, దీపికా పదుకొనె, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 27న విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది.
జై హనుమాన్
హనుమాన్ సినిమాతో బంపర్‌హిట్ కొట్టారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ౖజై హను మాన్’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు ప్రశాంత్‌వర్మ. ‘హనుమాన్’ మాదిరి కాకుండ ..‘జైహనుమాన్’లో ఎక్కువగా మైథలాజీ ఈక్వెషన్స్ అండ్ డ్రామా ఉంటాయని ‘హనుమాన్’ సినిమా క్లిప్హ్యాంగర్లో వచ్చిన ‘జై హనుమాన్’ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.
మరి…‘జై హనుమాన్’ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ఆడియన్స్‌లో ఉంది. ఇక మహాభారతం ఆధారంగా సినిమా తీయాలని ఉందని, కాకపోతే రాజమౌళిగారు తీయాలనుకుంటున్నారు కాబట్టి, తాను ‘మహాభారతం’ జోలికి పోనని ‘హనుమాన్’ ప్రమోషన్స్‌లో ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
జఠాయు
‘సమ్మోహనం’, ‘అమితుమీ’ వంటి సెన్సిబుల్ సినిమాలను తీసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘జఠాయు’ అనే మైథలాజికల్ స్క్రిప్ట్‌పై కొంతకాలం వర్క్ చేశారు. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ, నానిలు హీరోలుగా నటిస్తారనే ప్రచారం సాగింది. ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రస్తుతానికి అయితే హోల్డ్‌లో పడింది.
వీరిబాటలోనే మరికొంతమంది యువ దర్శకులు, సీనియర్ దర్శకులు మైథలాజీ సినిమా తీసే సాధ్యా సాధ్యలపై పరిశోధనలు చేసుకుంటున్నారని తెలిసింది.