TamilCinema: కోలీవుడ్ దర్శకులకు చుక్కలు కనపడుతున్నాయి. వరుసగా సినిమాలు క్యాన్సిల్ అవుతుండటం ఆ పరిశ్రమ దర్శకులను కలవరపెడుతోంది. చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగి, ఆ సినిమా దర్శకుడు మారిపోతున్నా డు (TamilCinema)
విఘ్నేష్ శివన్– అజిత్
దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త ) తమిళ స్టార్ హీరో అజిత్‌తో ఓ సినిమా చేయాల్సింది. లైకా ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. అజిత్– లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్లో మాత్రం సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ‘విడముయార్చి’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రా నికి మగిళ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కావాల్సింది. ఇలా అజిత్‌తో విఘ్నేష్ శివన్ సినిమాను కోల్పోయారు.
కమల్‌హాసన్– హెచ్ వినోద్
అజిత్‌తో వరుసగా ‘నెర్కొండపర్వై’(హిందీ హిట్ ‘పింక్’ రీమేక్), ‘వలిమై’, ‘తునివు’(తెలుగులో ‘తెగింపు’) సినిమాలు తీశారు దర్శకుడు హెచ్. వినోద్. కాగా చాలా కాలం కష్టపడి హెచ్. వినోద్ ఓ కథను రెడీ చేశారు. ఇందులో కమల్‌హాసన్ హీరో. కమల్ కెరీర్లో 233వ చిత్రంగా తెరకెక్కాల్సిన సినిమా ఇది. కమల్‌హాసన్ సొంత నిర్మాణసంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థయనిర్మించాల్సింది. కానీ ఈ సినిమా ఆగిపోయినట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హెచ్. వినోద్ చేతిలో ఏ సినిమా లేదు. కమల్‌హాసన్‌తో సినిమా కోసం హెచ్. వినోద్ కేటాయించిన సమయం అంతా వృథా అయిపోయింది.
రాఘవా లారెన్స్– అన్భుఅరివు
’కేజీఎఫ్’ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బుఅరివుల దర్శకత్వంలో రాఘవాలారెన్స్ హీరోగా ‘దుర్గ’ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా రాఘవాలారెన్స్ చెప్పారు. దీంతో ప్రస్తుతం అన్బు అరివుల ద్వయం కమల్‌హాసన్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. 2025లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు..రాఘవాలారెన్స్ ఇటీవల ‘బెంజ్’ అనే సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ అందించారు. ఈ సినిమాకు ఓ నిర్మాత కూడా. కానీ దర్శకుడు మారినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ఫస్ట్ నుంచి రత్నకుమార్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బక్కియరాజ్ కన్నన్ ఖరారైయ్యారు. దీంతో రత్నకుమార్ ఈ సినిమా కోసం వేచి ఉన్న సమయం అంతా వృథాగా పోయింది.
సూర్య– బాల
దర్శకుడు బాలతో సూర్య గతంలో రెండు సినిమాలు తీశాడు. వాటిలో ఒకటి ‘శివపుత్రుడు’. అయితే వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా ఖరారై పోయింది. ‘అచలుడు ’ (తెలుగు టైటిల్) టైటిల్‌తో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా దర్శకుడు బాల,హీరో సూర్య ఎవరికీ వారు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ఇదే సినిమాను దర్శకుడు బాల ఇప్పుడు అరుణ్‌విజయ్‌తో తీస్తున్నాడు. షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కావొచ్చు.
శంకర్– రణ్‌వీర్‌సింగ్
దర్శకుడు శంకర్ కెరీర్లో ‘అన్నియాన్’ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా అప్డేటెడ్ వెర్షన్‌ను బాలీవుడ్లో రణ్వీర్ సింగ్‌తో తీద్దామనుకున్నారు శంకర్. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘అన్నియాన్’ నిర్మాత రీమేక్ రైట్స్ విషయంలో శంకర్‌కు అడ్డుపడుతున్నారని కోలీవుడ్ టాక్.
అంతే కాదు…‘ఇండియన్ 2’ విషయంలో ఈ చిత్రం నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, శంకర్‌కు అభిప్రాయ బేధాలు వచ్చాయి. వ్యహహారం కోర్టు కేసుల వరకు వెళ్లింది. అయితే ‘ఇండియన్’ హీరో కమల్‌హాసన్ జోక్యం చేసుకుని, వ్యవహరాన్ని చక్కబెట్టారు. అయితే నిర్మాణంలో రెడ్ జెయింట్ మూవీస్ వచ్చి చేరింది. అదేనండీ…ఉదయనిధి స్టాలిన్ నిర్మాణసంస్థ. ఇక ‘ఇండియన్ 2’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇలా చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగి, క్యాన్సిల్ అయిన మరికొన్ని కాంబినేషన్ సినిమాలు ఉన్నాయి.