Ajith VidaaMuyarchi: బర్త్ డేకి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్(Ajith) తన కెరీర్‌లోని నెక్ట్స్ ఫిల్మ్‌ని అధికారికంగా ప్రకటించారు. అలాగే టైటల్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అజిత్ కెరీర్‌లో 62(AK62)వసినిమా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ‘విడాముయర్చి’(తెలుగులో ‘పట్టుదల’ అని అర్థం) టైటిల్ ఖరారు చేశారు. మగిళ్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమారెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్, త్రిష,నయనతార పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా మే1న అజిత్ బర్త్ డే..ఈ సందర్భంగా ‘విడాముయర్చి’ టైటిల్ ను చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది.
తప్పుకున్న విఘ్నేశ్‌శివన్
అజిత్ కెరీర్‌లోని 62వ సినిమా నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఉండాల్సింది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అధికారికంగానే ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేశ్ శివన్ తప్పుకున్నారు. కథ విషయంలో అజిత్, విఘ్నేశ్, లైకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఇది జరిగిందని కోలీవుడ్ టాక్.