TeluguDirectorsHindiFilms:‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కార్తికేయ 2’..వంటి సినిమాలు హిందీ బెల్ట్‌లో సూపర్‌హిట్ మూవీస్. కానీ ఈ సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ చేయబడి, అక్కడ రిలీజైన సినిమాలు. తెలుగు దర్శకులు తెలుగు సినిమాలను తీసి, వీటిని హిందీలో డబ్బింగ్ చేస్తే నార్త్ ఆడియన్స్‌కు నచ్చుతుంది. కానీ తెలుగు దర్శకులు రీసెంట్ టైమ్స్‌లో చేసిన ఓ స్ట్రయిట్ హిందీ మూవీ హిటై్టట దాఖలాలు లేవు (TeluguDirectorsHindiFilms).
ఇప్పుడు మరికొంతమంది తెలుగు దర్శకులు హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్స్ తీసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రశాంత్‌వర్మ- రణ్వీర్సింగ్వంశీపైడిపల్లి- షాహిద్కపూర్గోపీచంద్మలినేని- సన్నీ డియోల్నిర్మాణసంస్థలకు కలిసి రాలేదు!సందీప్‌రెడ్డి వంగా స్పెషల్
గౌతమ్తిన్ననూరి- జెర్సీ-షాహిద్‌కపూర్
నానితో తెలుగులో ‘జెర్సీ’ సినిమా తీశాడు గౌతమ్తిన్ననూరి. తెలుగులో ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. కానీ ఇదే సినిమాను, ఇదే దర్శకుడు హిందీలో రీమేక్ చేశాడు. షాహిద్‌కపూర్ హీరో. కానీ బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం మారింది. ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ సినిమా ఫ్లాప్ కారణంగానే రామ్చరణ్తోసినిమా చేసే చాన్స్‌ను గౌతమ్తిన్ననూరి వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరిగింది.
TollywoodHero: బాలీవుడ్ డెబ్యూ..అట్టర్ ఫ్లాప్!
శైలేష్ కొలను- హిట్- రాజ్‌కుమార్‌రావు
దర్శకుడు శైలేష్‌కొలను ‘హిట్’ సినిమా తీశాడు. తెలుగులో విశ్వక్సేన్ చేసిన ఈ సినిమా హిట్. కానీ ఇదే సినిమాను శైలేషే హిందీలో రీమేక్ చేస్తే ఫ్లాప్. రాజ్‌కుమార్‌రావు హీరోగా నటించారు.
సంకల్ప్‌రెడ్డి- ఐబీ71- విద్యుత్‌జమాల్
తెలుగులో ‘ఘాజీ’ వంటి హిట్ సినిమా తీసి, ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. అయితే సంకల్ప్‌రెడ్డి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ ‘ఐబీ71’. విద్యుత్‌జమాల్ హీరోగా నటించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలు వచ్చాయి.
సేమ్ మరో తెలుగు దర్శకుడు ప్రకాష్ కొవెలమూడి తీసిన స్ట్రయిట్ హిందీ చిత్రం ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’. రాజ్‌కుమార్‌రావు, కంగనారనౌత్ లీడ్ రోల్స్‌లో చేశారు. ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ రిజల్ట్ మాత్రం ఫ్లాప్.
ఇప్పుడు మరికొంతమంది తెలుగు దర్శకులు హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్స్ తీసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
TollywoodHero:పెంచుతున్నారు జుట్టు….కొడతారా హిట్టు!
ప్రశాంత్‌వర్మ- రణ్‌వీర్‌సింగ్
ఈ ఏడాది సంక్రాంతికి ‘హను–మాన్’తో సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్ అందుకున్న ప్రశాంత్‌వర్మకు ఓ హిందీ సినిమా కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఈ సినిమా చేయనున్నాడు. ‘రాక్షస’ అనే టైటిల్ ఈ సినిమాకు ఉంటుందని, ఈ చిత్రం మైథలాజికల్ ఫిల్మ్ అని టాక్.మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారట.
వంశీపైడిపల్లి- షాహిద్‌కపూర్
తెలుగులో ‘బృందావనం’, ‘ఎవడు’ వంటి హిట్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ దర్శకుడు కూడాహిందీలో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారట. షాహిద్‌కపూర్ హీరోగా నటించనున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది.
గోపీచంద్‌మలినేని- సన్నీ డియోల్
రీసెంట్గా తెలుగులో ‘వీరసింహారెడ్డి’, ‘క్రాక్’ వంటి సినిమాలను తీసిన గోపీచంద్ మలినేని హిందీలో తొలి సినిమా చేయడానికి రెడీ అయ్యారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారని, సన్నీ డియోల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి…ఈ తెలుగు దర్శకులు హిందీలో కూడా సక్సెస్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?
నిర్మాణసంస్థలకు కలిసి రాలేదు!
స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసిన టాలీవుడ్ నిర్మాణసంస్థలు పెద్దగా మూటగట్టుకుంది కూడ ఏమీ లేదు. హిందీ ‘హిట్’, ‘జెర్సీ’ సినిమాల నిర్మాణంలో ‘దిల్’ రాజు భాగస్వామ్యులు. కానీ ఈ సినిమాలు హిట్కాలేదు. అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. కార్తీక్ఆర్యన్ హీరో.నిర్మాత అల్లు అరవింద్ అల్లు ఎంటర్టైన్మెంట్, ఎస్. రాధాకృష్ణల హారిక అండ్ హాసిని నిర్మాణసంస్థలుఈ సినిమా రీమేక్‌లో నిర్మాణభాగస్వామ్యులు. ఇప్పుడు మైత్రీమూవీమేకర్స్ సంస్థ స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. మరి…ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
RajamouliSSMB29: రాజమౌళి అలా చేస్తే మహేశ్‌బాబు చాలా లక్కీ!
సందీప్‌రెడ్డి వంగా స్పెషల్
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో సూపర్‌డూపర్‌హిట్ అందుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. కాగా ఇదే సినిమాను హిందీలో షాహిద్కపూర్తో ‘కబీర్‌సింగ్’గా రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ తీసిన మరో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో హిందీలో స్ట్రయిట్ మూవీ చేసి, హిట్ కొట్టిన తెలుగు దర్శకుడిగా సందీప్రెడ్డివంగా పేరు చెప్పుకోవచ్చు. అలాగే రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకులుగా హిందీలో రాణిస్తున్నారు. అయితే వీరి ప్రయాణం గతంలో ఎప్పుడో మొదలైంది.