TollywoodHero: రాజమౌళితో సినిమా కోసం
‘అతిథి’ సినిమాలో మహేశ్‌బాబు లాంగ్ హెయిర్ స్టైల్ భలేగా ఉంటుంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు హెయిర్ స్టైల్ కోసం అయిన ఖర్చును గురించి అప్పట్లో ప్రత్యేకంగా వార్తలు వచ్చాయంటే అర్థం చేసు కోండి. సిల్వర్‌స్క్రీన్‌పై మహేశ్‌బాబు హెయిర్ స్టైల్ లుక్ కున్న క్రేజ్. ఆ తర్వాత రీసెంట్గా ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌లో ఆయన జుట్టు కాస్త ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. మళ్లీ ఇప్పుడు మహేశ్‌బాబు ‘అతిథి’ తరహాలో…చెప్పాలంటే…ఇంకా అంతకుమించి ఉండేలా హెయిర్ పెంచుతున్నారు.(TollywoodHero)
ఎందుకంటే రాజమౌళితో చేయనున్న సినిమా కోసం. ఆల్రెడీ లాంగ్ హెయిర్‌తో ఉన్న మహేశ్‌బాబు లుక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమాను గురించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త.
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే
ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’
రీసెంట్గా ప్రభాస్ లుక్స్ చూశారాగా..! లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ ‘కల్కి2898ఏడీ’ సినిమా కోసం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే…ప్రభాస్ లాంగ్ హెయిర్‌తోనే కనిపిస్తాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశ్విన్ దత్ నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ స్పష్టత రానుంది.
అలాగే ‘సలార్ 2’ కోసం కూడా ఇదే లుక్ ప్రభాస్ కనిపించే చాన్సెస్ ఉన్నాయి. కాకపోతే… ఫ్లాష్‌బ్యాక్ ఏపిసోడ్స్‌లో ఉండొచ్చు. ప్రశాంత్‌నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ‘సలార్’లోని తొలిభాగం ‘సలార్: సీజ్ఫైర్’కు మలిభాగంగా ఉంటే..‘సలార్: శౌర్యంగాపర్వం’లో ప్రభాస్ లాంగ్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. 2025లో ‘సలార్: శౌర్యంగాపర్వం’ సినిమా విడుదల అవుతుంది.
పుష్పరాజ్
‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ కట్ చేయడం మర్చిపోయారు. ‘పుష్ప’ సినిమా తొలిభాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ హెయిర్ బాగా పెంచారు.
ఒత్తైన హెయిర్‌తో మంచి లుక్‌లో కనిపించారు. కానీ ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: ది రూల్’ కోసం అల్లు అర్జున్ ఇంకా లాంగ్ హెయిర్ పెంచారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ లుక్స్ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?
నాగచైతన్య తండేల్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో కనిపిస్తారు నాగచైతన్య. 2018లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలోని లుక్ కోసం నాగచైతన్య హెయిర్ పెంచారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణతోనే బిజీగా ఉన్నారు నాగచైతన్య. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ‘తండేల్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు చివర్లో విడుదల కానున్నట్లుగా తెలిసింది.
NTR Devara: దేవర ముందు ఎన్నో అడ్డంకులు
అఖిల్ ‘ధీర’
ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అఖిల్ నెక్ట్స్ మూవీ ఫ్యాంటసీ ఫిల్మ్ అని, ‘ధీర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు అఖిల్ దర్శకత్వం వహిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్‌లో ఉన్నారు అఖిల్. రీసెంట్గా ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ కనిపించిన లాంగ్ హెయిర్ లుక్ ఇందుకు ఓ నిదర్శనం. యూవీక్రియేషన్స్తో కలిసి హోంబలే ఫిలింస్ (కేజీఎఫ్, సలార్, కాంతార) ఈ సినిమాను నిర్మించనున్నారని భోగట్టా.
Vijaydevarakonda: విజయ్ దేవరకొండ… రణ్‌వీర్‌సింగ్..టఫ్టైమ్స్!
నిఖిల్ స్వయంభూ
ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ అనే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. భరత్‌కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకుడు. సంయుక్తామీనన్ హీరోయిన్. మరో హీరోయిన్ నభానటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ లాంగ్ హెయిర్ పెంచారు. ‘స్వయంభూ’ సినిమాను ఎలాగైన
ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ఏడాది సెకండాఫ్‌లో భారీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండటంతో ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కావొచ్చు.