Kamalhaasan Indian2: కమల్‌హాసన్ కెరీర్లో ఇండియన్ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం బ్లాక్‌బస్టర్. 1996 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని సాధించినా కానీ ‘ఇండియన్ 2’(Kamalhaasan Indian2) ను శంకర్‌తో స్టార్ట్ చేయడానికి కమల్‌హాసన్‌కు పాతిక సంవత్సరాలకు పైగా సమయం పట్టింది.
సజావుగా సాగని చిత్రీకరణ
‘ఇండియన్2’ (Kamalhaasan Indian2) సెట్స్‌లో భారీ ప్రమాదం, శంకర్‌కు ఈ చిత్ర నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ అభిప్రాయభేదాలు, బడ్జెట్ సమస్యలు వంటి వాటితో ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. కానీ ప్రాజెక్ట్‌లోకి కొత్త నిర్మాణసంస్థ రెడ్ జెయింట్ మూవీస్ (ఉయదనిధి స్టాలిన్) చేరికతో ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణ ఊపందుకుంది. ఊపందుకోవడం ఏంటీ…‘ ఇండి యన్ 2’ షూటింగ్ కూడా పూర్తయింది. పనిలో పనిగా ‘ఇండియన్ 3’ సినిమా చిత్రీ కరణను కూడా పూర్తి చేశారు కమల్, శంకర్.
ఇండియన్ 3 కూడా
‘ఇండియన్’ సినిమా షూటింగ్‌ను గురించి కమల్‌హాసన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లా డారు. ‘‘ఇండి యన్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ‘ఇండియన్ 3’ చిత్రీకరణ సైతం పూర్తయింది. ‘ఇండియన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వర లోనే రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత ‘ఇండియన్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నట్లుగా కమల్‌హాసన్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసినట్లుగా కమల్‌హాసన్ చెప్పారు.
‘థగ్‌లైఫ్’ షూటింగ్ అందుకే వాయిదా!
‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 37 సంవత్సరాల తర్వాత వస్తున్న గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘థగ్‌లైఫ్’. త్రిష, ఐశ్వర్యాలక్ష్మీ, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్‌లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన దుల్కర్సల్మాన్, ‘జయం’ రవిలు కాల్షీట్స్ను సర్దుబాటు చేయలేక ‘థగ్‌లైఫ్’ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తు న్నాయి.
నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈ పాటికే సెర్బియాలో ప్రారంభం కావాల్సింది. మణిరత్నం సెర్బియా వెళ్లి లొకేషన్స్‌ను కూడా చూసొచ్చారు. కానీ దేశంలో ఎన్నికల దృష్ట్యా కమల్ హాసన్ షెడ్యూల్ మారింది. తన రాజకీయపార్టీకి, తన పార్టీ సపోర్ట్ చేస్తున్న మరో ప్రముఖ పార్టీకి కమల్‌హాసన్ ప్రచారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలకు కాస్త పక్కన పెట్టారు కమల్‌హాసన్. ఇలా ‘థగ్‌లైఫ్’ సినిమా చిత్రీకరణకు బ్రేక్స్ పడ్డాయి.
ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లే!
కమల్‌హాసన్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాను గురించి కమల్ స్పందించలేదు. కాబట్టి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లే అని తెలుస్తోంది. ఇక కమల్హాసన్హీరోగా కేజీఎఫ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివిల దర్శకత్వంలో కమల్‌హాసన్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 2025లో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. అన్బు, అరివిలకు దర్శకులుగా ఇదే తొలి సినిమా.