పంచభూతాల కాన్సెప్ట్?
పంచభూతాలు(గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి) నేపథ్యాలతో ‘సాక్ష్యం’ సినిమాను తీశాడు శ్రీవాస్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజాహెగ్డేహీరోయిన్గా నటించారు. ఇప్పుడు ‘పంచభూతాలు’ కాన్సెప్ట్‌తోనే ‘విశ్వంభర’ చిత్రం కూడా తెరకెక్కు తుందనే టాక్ వినిపిస్తోంది. ‘విశ్వంభర’ కాన్సెప్ట్ పోస్టర్ కూడా పంచభూతాలను ప్రతిభింభిస్తున్నట్లుగానే ఉండటం పుకార్లకు మరింత ఊతం అందిస్తున్నట్లవుతోంది. మరి…పంచభూతాల కన్సెప్ట్నే అయినప్పటికీని వశిష్ట ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
జోరుగా విశ్వంభర చిత్రీకరణ
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘స్టాలిన్’ సినిమా తర్వాత 18 ఏళ్లకు చిరంజీవి– త్రిషలకు కలిసి మళ్లీ ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు మేకర్స్. ఈ షెడ్యూల్ పూర్తయింది. ‘విశ్వంభర’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మి స్తోంది.
భీమవరం దొరబాబు!
‘విశ్వంభర’ సినిమాలో భీమవరం దొరబాబు పాత్రలో కనిపిస్తారట చిరంజీవి. కథ రిత్యా చిరంజీవికి ము గ్గురు సిస్టర్స్ ఉంటారట. ఇషాచావ్లా, సురభి, ఆషికా రంగనాథన్‌లు చిరం జీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తార ని తెలుస్తోంది. అలాగే మృణాల్‌ఠాకూర్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. మరి కొంత మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.