Trisha Krishnan: ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ త్రిష (Trisha Krishnan). చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకుడు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ పతాకపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు చిరంజీవి. తాజా త్రిష జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.
Chiranjeevi Vishwambhara: చిరంజీవి విశ్వంభర..నిరాశలో ఫ్యాన్స్?
#Trisa#Chiranjeevi#Vishwambharapic.twitter.com/ZtxhtL8Jlo https://t.co/Q0nFzeidfC
— TollywoodHub (@tollywoodhub8) February 5, 2024
స్టాలిన్ సినిమాలో తొలిసారి చిరంజీవితో జోడీ కట్టారు హీరోయిన్ త్రిష. 2006లో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సందేశాత్మక చిత్రం ఫర్వాలేదనిపించింది. మళ్లీ ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్నారు. ఇక 2022లో చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ ఓ కీ రోల్ చేసిన ‘ఆచార్య’లో తొలుత హీరోయిన్గా త్రిషను తీసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో త్రిష ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడు త్రిష ప్లేస్‌లో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్న తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. మళ్లీ ఇప్పుడు చిరంజీవి సినిమాకే సైన్
చేయడం విశేషం. ఇలా ‘ఆచార్య’తో బ్రేకప్ అయిన త్రిష..ఇప్పుడు విశ్వంభరతో ప్యాచప్ అయ్యా రన్నమాట.
Guess this is what homecoming feels like😇❤️🧿
When magic and nature’s wonder take centre stage👑 #Vishwambhara pic.twitter.com/Ca62nl2Gry
— Trish (@trishtrashers) February 5, 2024
మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఓ లీడ్ రోల్ చేశారు. మంచి పేరు వచ్చింది. వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ మాదిరి ‘విశ్వంభర’ కూడా కాస్త పీరియాడికల్ఫిల్మ్ కాబట్టి త్రిష సైన్ చేసి ఉండొచ్చు. టాలీవుడ్లో వరుస భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి.
ఈక్రమంలో విశ్వంభర అవకాశం సీనియర్ హీరోయిన్ అయిన త్రిషకు కూడా లాభిస్తుందనడంలో సందేహం లేదు.