Trisha: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టారు హీరోయిన్ త్రిష (Triha krishnanan). ట్రెడిషనల్ దుస్తుల్లో గ్లామర్‌గా కనిపించారు. దీంతో త్రిషకు ఒక్కసారిగా అవకాశాలు వెల్లువగా వచ్చి పడ్డాయి. త్రిష ఇప్పుడు ఫర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఎవరు కాదనలేని పరిస్థితి. తెలుగులో చిరంజీవితో ‘విశ్వంభర’ చేస్తున్నారు త్రిష. తమిళంలో కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్’, అజిత్‌తో ‘విడాముయార్చి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’ సినిమాలో త్రిష హీరోయిన్. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అయితే షూటింగ్ అంతా ఫారిన్లో జరగాలి. కోవిడ్ సమయంలో ఫారిన్ ట్రావెల్ కుదర కపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగింది. కానీ క్యాన్సిల్ కాలేదు. ఇక బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేయనున్నారు త్రిష. ఇలా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో హీరోయిన్గా త్రిష చాలా బిజీగా ఉన్నారు. కన్నడలో కూడా త్రిష హీరోయిన్గా ఓ సినిమా కమిటైయ్యారు. పునీత్‌రాజ్‌కుమార్ హీరో. కానీ పునీత్ హఠాన్మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే కన్నడ చిత్రం పరిశ్రమ నుంచి మాత్రం త్రిషకు ఆఫర్లు అయితే వస్తున్నాయి. మంచి కథ కుదిరితే త్రిష కూడా చేయాలనుకుంటున్నారట. అలాగే త్రిష ఓటీటీలో ‘బృంద’ అనే వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఇందులో త్రిష పోలీసాఫీర్. అదీ సంగతి..మరి..ఇప్పుడు చెప్పండి..త్రిష పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఒప్పుకోవాల్సిందే కదా!
Trisha: త్రిష..పాన్ ఇండియా హీరోయిన్
తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు త్రిష. అలాగే ఓ వెబ్‌సిరీస్ కూడా త్రిష చేతిలో ఉంది.
Leave a comment
Leave a comment