MAA ManchuVishnu: ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’(మా) విరాళాల సేకరణ కోసం విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం మాములే. కానీ వివిధ కారణాల వల్ల గత ఆరు సంవత్సరాలుగా ‘మా’ (MAA ManchuVishnu)ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ తక్కువగా చేస్తోంది. అయితే ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మళ్లీ ఇలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించదలచారు. తొంభై సంవత్సరాల తెలుగు సినిమాల చరిత్రలోని విశేషాలు, ఘనకీర్తీలను తెలియజేసే విధంగా మలేసియాలో ‘నవతహి’ అనే ఓ వేడుకను నిర్వహించదలచారు. ఈ కార్యక్రమం వివారాలను తెలియజేడానికి హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచు విష్ణు మాట్లాడిన మాటలు చర్చనీయాంశమైయ్యాయి.
800మందికి పైగా ఉన్న ‘మా’ సభ్యుల సహకారంతో నవతహి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఇతర రాష్ట్రాల నటీనటులను కూడా ఇందులో భాగం చేస్తామని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఈ వేదికగా తెలుగు సినిమాలోని కొన్ని ఆసక్తికర విశేషాలను షేర్ చేసుకున్నారు మంచు విష్ణు. అమితాబ్బచ్చన్గారిని లాంచ్ చేసింది మన తెలుగు దర్శకులు డూండీగారు, అనీల్కపూర్గారి మొదటి సినిమాకు దర్శకత్వం వహించింది బాపుగారు..అంటూ ఇలా కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తెలుగులో తొలిసారిగా పద్మవిభూషణ్ అవార్డును సాధించినది మెగాస్టార్ చిరంజీవిగారుఅంటూ మాట్లాడారు. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. తొలిసారి పద్మవిభూషణ్ సాధించినది అక్కినేని నాగేశ్వరరావుగారు కదా….మెగాస్టార్ చిరంజీవి అంటారేంటీ అంటూ మంచు విష్ణుపై మండిపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. పనిలో పనిగా గతంలో మంచు విష్ణు ట్రోలింగ్‌కు గురైన వీడియోలను మళ్లీ సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.
క్షమించండి
అయితే ఆ తర్వాత తన పొరపాటను సరిదిద్దుకున్నారు మంచు విష్ణు. పొరపాటున పద్మవిభూషణ్ అవార్డు సాధించిన తొలి తెలుగు నటుడిగా చిరంజీవిగారి పేరు చెప్పారని, ఆయన కంటే ముందే మన అక్కినేని నాగేశ్వరరావుగారికి వచ్చిందని, ఈ పొరపాటుకు క్షమించమని మంచు విష్ణు వెంటనే రియాక్ట్ అయ్యారు. అలాగే హేచ్ఎమ్ రెడ్డిగారి తొలి సినిమా ‘భక్తప్రహ్లాద’ అయితే మంచు విష్ణు ‘రాజా హరిశ్చంధ్ర’ అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత ఆయన ఈ విషయంపై క్షమాపణలు కోరారు.
మా బిల్డింగ్ వ్యహాహారం లేనట్లే!
మా బిల్డింగ్‌పై కూడా మంచు విష్ణు మాట దాటేశారు. ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ‘మా’ బిల్డింగ్యే ఏజెండా అన్నట్లుగా మాట్లాడారు. అసవరమైతే కొంత మొత్తాన్ని సొంతంగా భరించాలనిమంచు విష్ణు భావించినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం ‘మా’ బిల్డింగ్‌కు మరో 18 నెలల సమయం పడుతున్నట్లుగా విష్ణు చెబుతున్నారు. ఈ లోపు విష్ణు టర్మ్ అయిపోతుంది. అలాగేరాబోయే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా లేదని మంచు విష్ణు చెప్పారు. సో…మంచు టర్మ్‌లో ‘మా’ బిల్డింగ్ వ్యవహారం లేనట్లే అని తెలుస్తోంది.
ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నారు. ముఖేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తొంభైశాతం పూర్తయిందని మంచు విష్ణు వెల్లడించారు.