kamalhasaan indian2: కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ (kamalhasaan indian2) సినిమా మేలో విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది సడన్‌గా. మే 09న ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా వస్తున్నప్పుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా మేలో ఏ విధంగా విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీమూవీస్ పతాకంసై సి. అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Kalki2898AD Release: మరోసారి రిలీజ్‌డేట్ కన్ఫార్మ్ చేసిన ప్రభాస్…ఇక టా టక్కర టక్కా టక్కరట!
అయితే ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ ఏమాత్రం వాయిదా పడ్డ ఆ ప్లేస్‌లో ‘ఇండియన్ 2’ను రిలీజ్ చేయాలని కమల్‌హాసన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. పైగా ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో కమల్‌హాసన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సో..’కల్కి 2898ఏడీ’ రిలీజ్‌పై కమల్‌కు ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు. ఒకవేళ ‘కల్కి 2898ఏడీ’ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడితే… ఆ తేదీకి ‘ఇండియన్ 2’ సినిమాను దించాలన్నది కమల్‌హాసన్ ప్లాన్ కావొచ్చు.
Prabhas Kalki2898AD: ప్రభాస్‌కు హాలీవుడ్ అడ్డంకి
ఆసక్తికరంగా కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్ ‘ సినిమా మే 9నే విడుదల అయ్యింది. ఇప్పుడు సీక్వెల్ ‘ఇండియన్ 2’ను కూడా ఇదే తేదీ అంటే.. మే 09నే విడుదల చేయాలన్నది కమల్‌హాసన్ ప్లాన్ కాబోలు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, ప్రియాభవానీ శంకర్లు కీలక పాత్రలు చేశారు. లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్లు భారీ బడ్జెట్‌తో ‘ఇండియన్ 2’ సినిమా తీశారు. ‘ఇండియన్ 3’ చిత్రం కూడా ఉంటుంది. 2025లో ‘ఇండియన్ 3’ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.