Gopichand Bhimaa: గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’ (Gopichand Bhimaa). కన్నడ దర్శకుడు ఏ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్, మాళివికానాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో పోలీసాఫీసర్ భీమా పాత్రలో కనిపిస్తారు గోపీచంద్. విడుదలైన ట్రైలర్లో మాంచి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.
పైగా ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ గెటప్స్‌లో కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మరి..’భీమా’ సినిమాలోగోపీచంద్ డబుల్ రోల్ చేస్తున్నారా? లేక క్యారెక్టర్లో వెరియేషన్స్ ఉన్నాయా? అనేది తెలియాలంలే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఈ సినిమా కాకుండా గోపీచంద్ చేస్తున్న మరో సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
Pawan OG: ఓజీ అప్డేట్ చేప్పిన నిర్మాత దానయ్య…వపన్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
ఈ సినిమా ప్రొడక్షన్స్ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు ఇలా ఉండగానే గోపీచంద్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తనతో ‘జిల్’ వంటి స్టైలిష్ ఫిల్మ్ తీసిన రాధాకృష్ణకుమార్కు గోపీచంద్ మరో చాన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అనే ప్రచారం సాగుతోంది.