తెలుగు అమ్మాయిగా హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi) ప్రేక్షకులకు సుపరిచితమే. డింపుల్ హయతి హీరో యిన్‌గా చేసిన తాజా చిత్రం ‘రామబాణం’. గోపీచంద్ హీరోగా నటించగా, శ్రీవాస్ డైరెక్షన్ చేశారు.ఈ సినిమాలో విక్కీ పాత్రలో గోపీచంద్, భైరవి పాత్రలో డింపుల్ నటించారు. టీజీ విశ్వప్రసాద్, డింపుల్హయతి నటించిన ‘రామాబాణం’ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా డింపుల్ హయతి మీడియాతో మాట్లాడారు. ఈ ఇంట్రాక్షన్లో రామబాణం సినిమాలో తన ఎంపికను గురించి చెప్పుకొచ్చారుడింపుల్ హయతి.
‘ఖిలాడి’ సినిమాలో డింపుల్ హయతి గ్లామరస్‌గా కనిపించారు. దీంతో రామబాణంలోని భైరవి పాత్రకు డింపుల్ న్యాయం చేయలేరెమోనని దర్శకుడు శ్రీవాసు సంకోచించాడు. దీంతో డింపుల్‌కు రెండు సార్లుస్క్రీన్ టెస్ట్ చేసి, ఆ తర్వాత భైరవి పాత్రకు డింపుల్‌ను తీసుకున్నారు. ఫుడ్మాఫియా నేపథ్యానికి ఫ్యామిలీఫన్ ఎలిమెంట్స్ జోడించి శ్రీవాస్ తీసిన ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్భూ, ‘వెన్నెల’ కిశోర్ వంటి
వారు నటించారు.
ఇక ఈ మీడియా ఇంట్రాక్షన్లో డింపుల్ హయతి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డింపుల్ హయతి హిందీలో నటించిన తొలి చిత్రం ‘అత్రాంగి రే’. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోఅక్షయ్కుమార్, ధనుష్, సారా అలీఖాన్ లీడ్ రోల్స్ చేశారు. ఇదే డింపుల్ హయతి కూడా ఓ కీ రోల్ చేశారు.అయితే ఈ చిత్రంలో ఓ లెంగ్తీ డైలాగ్ చెప్పి, యాక్టింగ్ స్కోప్ ఉన్న ఓ సీన్ చేశారు డింపుల్ హయతి. అయితే ఈ సినిమాలో ఆ సన్నివేశమే లేదట. దీంతో అప్పుడు డింపుల్‌కు ఏడుపొచ్చిందట. ఈ విషయాన్ని గమనించిన ధనుష్ ఆమెను ఓదార్చారట.