“ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించినది కాదు, ప్లాన్ చేసింది కాదు’ అని గోపీచంద్ వాయిస్ ఓవర్‌తో ‘రామబాణం’ ట్రైలర్ విడుదలైంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్హయతి హీరోయిన్గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వివేక్ కూచిబొట్లఈ సినిమాకు సహ నిర్మాత. జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం మే 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది.
ఈ సినిమాలో అన్నదమ్ములుగా గోపీచంద్, జగపతిబాబు నటించారు.లక్ష్యం చిత్రం తర్వాత గోపీచంద్, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం ఇది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో ఫుడ్మాఫియా నేపథ్యంలో సాగే కుటుంబకథా చిత్రంగా రామబాణం సినిమా ఉంటుంది.