Dhanush-Selvaraghavan: హీరో ధనుష్, దర్శక-నటుడు సెల్వరాఘవన్ సొంత అన్నదమ్ములన్న విషయం కొంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ‘రాయన్’ సినిమా కోసం ఈ ఇద్దరు విషయంలో సీన్ అయినట్లుంది. ఎలా అంటే…సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘కాదల్ కాండెయిన్’ (2003)(తెలుగులో ‘అల్లరి’ నరేశ్ ‘నేను’గా రీమేక్ చేశారు), పుదుపెట్టై (2006), ‘యారది నీ మోహిని'(వెంకటేష్‌తో సెల్వరాఘవన్ తీసిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా తమిళ రీమేక్), మయక్కాం ఎన్నా, నేనే..వరువన్(తెలుగులో ‘నేనే వస్తున్నా’గా అనువాదంచేశారు)లోని సినిమాల్లో ధనుష్ హీరోగా నటించారు (Dhanush-Selvaraghavan)
ఇటీవల సెల్వరాఘవన్ యాక్టింగ్‌ను కూడా స్టార్ట్ చేశారు. అలా ధనుష్ దర్శకత్వంలోని రెండో సినిమా ‘రాయన్’లో సెల్వరాఘవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ని రోజులు సెల్వరాఘవన్ డైరెక్షన్ చేయగా ధనుష్ యాక్ట్ చేశారు. ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ చేయగా, సెల్వరాఘవన్ యాక్ట్ చేశారు. ఇలా ఒకరికి ఒకరు వారి పోజిషన్స్ను చేంజ్ చేసుకున్నారు. ఇలా సెట్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది.
రీసెంట్గా ‘పుదుపెట్టై’కు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నానట్లుగా సెల్వరాఘవన్ ప్రకటించారు. అలాగే ధనుష్‌తో ‘యుగానికి ఒక్కడు 2’ ప్రకటించారు సెల్వరాఘవన్.ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయో చూడాలి.
ఇక రాయన్ విషయానికి వస్తే…ధనుష్ కెరీర్లో యాభైవ సినిమా ఇది. కాళిదాస్, సందీప్‌కిషన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు ఈ సినిమాలో. ప్రకాష్‌రాజ్, దుసారా విజయన్, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పిరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ను సన్‌పిక్చర్స్ నిర్మిస్తోంది. 2024 సెకండాఫ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.