రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. రీసెంట్గా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు ‘గేమ్‌చేంజర్’ను సెప్టెంబరులో విడుదల చేస్తామన్నట్లుగా చెప్పారు. కానీ ఎప్పుడైతే పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా సెప్టెంబరు 27 రిలీజ్‌కు సిద్ధం అయ్యిందో అప్పట్నుంచి మళ్లీ ‘గేమ్‌చేంజర్’ రిలీజ్‌పై అనుమానాలు మొదలైయ్యాయి.
‘గేమ్‌చేంజర్’ సెప్టెంబరు తొలివారంలో విడుదల అవుతుందని కొందరు, లేదు…డిసెంబరు తొలివారం లేదా క్రిస్మస్ ఫెస్టివల్‌కు విడుదల అవుతుందని జోస్యం చెబుతున్నారు మరికొందరు. ఏపీ ఎలక్షన్స్‌లో పవన్ బిజీగా ఉన్నారు, అలాగే ఓజీలో పవన్‌పై తీయాల్సిన చాలా సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ తరుణంలో ఓజీ సినిమా వాయిదాపడొచ్చు…ఇలా జరిగితే…గేమ్‌చేంజర్ సెప్టెంబరు 27న విడుదల కావొచ్చు అని కొంతమంది చరణ్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ ఆశలపై నీల్లు చల్లారు ఓజీ నిర్మాత డీవీవీ దానయ్య.
ఎలక్షన్స్ అయిపోగానే పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారని, సెప్టెంబరు 27న సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగానే…’గేమ్‌చేంజర్’ సినిమానుకూడా సెప్టెంబరు 27నే విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తున్నారట ‘దిల్’ రాజు. ఈ ప్రకారం బాక్సాఫీస్ వద్ద ‘గేమ్‌చేంజర్’, ‘ఓజీ’ సినిమాల క్లాష్ తప్పేలా లేదు.
గేమ్‌చేంజర్ సినిమాకు సెప్టెంబరునే మంచి రిలీజ్ నెలగా కనిపిస్తోంది. ఆగస్టులో ‘పుష్ప’ చిత్రం, అక్టోబరులో ‘దేవర’ ఉన్నాయి. నవంబరు అంటే డల్ మన్త్ ఇండస్ట్రీలో. ఇక డిసెంబరు అయితే బాగుటుంది గేమ్‌చేంజర్‌కు. కానీ మరింత ఆలస్యం అవుతుంది.
ఇక శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రం మేలో విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మేలో ఇండియన్ 2 విడుదలై బ్లాక్‌బస్టర్ అయితే…ఇదే జోష్‌లో సెప్టెంబరులో శంకర్ డైరెక్షన్‌లోని మరో మూవీ ‘గేమ్‌చేంజర్’ కూడా రిలీజ్ చేయవచ్చు. అలా కాకుండ…’ఇండియన్ 2′ రిజల్ట్ తేడా కొడితే మాత్రం..’గేమ్‌చేంజర్’ రిలీజ్ ఈ ఏడాది ఉండకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి…ఏం జరుగుతుందో చూడాలి.