Kalki2898AD Release: ప్రభాస్ హీరోగా చేస్తున్న మైథలాజి – సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ (Kalki2898AD Release) ‘కల్కి 2898ఏడీ’. వైజయంతీమూవీస్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. వైజయంతీమూవీస్లో హిట్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’, సినిమాలు విడుదలైన మే 09నే ‘కల్కి 2898ఏడీ’ సినిమానువిడుదల చేస్తున్నారు. కానీ ‘కల్కి 2898ఏడీ’ విడుదలైన కొన్ని అనుమానాలు ఇండస్ట్రీలో వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిదిఏమీ లేదని, మే 09ననే ‘కల్కి 2898ఏడీ’ సినిమా విడుదల అవుతుందని చిత్రంయూనిట్ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ప్రభాస్ పాల్గొనగ ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ట టక్కర టక్కా టక్కరట అనే లిరిక్స్‌తో సాగే మాస్ సాంగ్ ఇది. ప్రభాస్‌కు ఈ పాటలో జోడీగా దిశా పటానీ ఉంటారట.
Prabhas Kalki2898AD: ప్రభాస్‌కు హాలీవుడ్ అడ్డంకి
తొమ్మదిభాగాలుగా కల్కి2898?
ఇక కల్కి 2898 ఏడీ సినిమా తొలి భాగం మాత్రమే 2024 మే 9న విడుదల అవుతుందని, ఈ సినిమా మొత్తం తొమ్మిది భాగాలుగా వస్తుందనే టాక్ ఇండస్ట్రీలో విని పిస్తోంది. కథలో సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో పాటుగా పురణాల ప్రస్తావన కూడా ఉంటుందట. కల్కి 2898ఏడీలో విష్ణు తత్త్వం ఉంటుందని నిర్మాత సి. అశ్వనీదత్ ఆల్రెడీ కన్ఫార్మ్ చేశారు.
Prabhas: కల్కిలో రాజమౌళి క్యారెక్టర్ ఇదేనా?
శివరాత్రికి అప్డేట్
కల్కి 2898ఏడీ సినిమా అప్డేట్ను ఈ శివరాత్రి సందర్భంగా మార్చి 8న రానుందని తెలిసింది. ఓ కొత్త పోస్టర్ లేదా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు నాగ్ అశ్విన్. ఏప్రిల్‌లో ట్రైలర్ లాంచ్ ఉంటుంది. మే 09, 2024న సినిమా విడుదల కానుంది. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో ప్రభాస్‌తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశాపటానీ, అన్నా బెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్, నాని, విజయ్‌దేవరకొండ, దుల్కర్సల్మాన్, రాజమౌళి కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Samantha Ruth Prabhu: మలేషియాలో సమంత..బికినీ ఫోటోలు వైరల్!
Prabhas: రిస్క్ చేస్తున్న ప్రభాస్?