Prabhas: ‘కల్కి 2898ఏడీ’, ‘సలార్’, ‘రాజా సాబ్’...సినిమాలతో ప్రభాస్ ప్రస్తుతం బిజీ బిజీ. ఈ ఏడాది అక్టోబరులో ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit) సినిమా చేయనున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలతో పాటుగా ప్రభాస్ ఓ లవ్‌స్టోరీ చేయనున్నారు. ‘సీతారామం’ ఫేమ్ హనురాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రభాస్‌తో హనురాఘవపూడి చేసే సినిమా బోర్డర్ లవ్‌స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారనే ప్రచారం కూడాజరుగుతోంది. అయితే హనురాఘవపూడి గత చిత్రం ‘సీతారామం’ లో హీరో దుల్కర్సల్మాన్ కూడా సైనికుడి పాత్ర చేశారు. ఇప్పుడు సేమ్ దర్శకుడు..సేమ్ టైమ్ ఆఫ్ క్యారెక్టర్అంటే కాస్త ఆడియన్స్ కనెక్ట్ కావడం కాస్త కష్టమే. ఒకవేళ ప్రభాస్ ఇలానే చేస్తే కాస్త రిస్క్ తీసుకున్నట్లే అవుతుంది. పైగా ఆర్మీఆఫీసర్ స్టోరీలైన్‌తోనే హిందీలో రణ్‌బీర్‌కపూర్ ‘లవ్అండ్ వార్’ సినిమా చేస్తున్నారు. రణ్‌బీర్‌కపూర్, ప్రభాస్‌లకు మధ్య పోలిక లేవు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస కమిట్మెంట్స్ కారణంగా ‘లవ్ అండ్ వార్’ ముందుకు రిలీజ్ అవుతోంది.2025 డిసెంబరులో ఈ చిత్రం విడుదల కానుంది. అప్పుడు ఒకే స్టోరీలైన్‌తో సినిమాలంటే ఆడియన్స్ అంతగా థియేటర్స్‌కు రాకపోవచ్చు. ఇక ప్రభాస్ హీరోగా చేసిన తాజా చిత్రం’సలార్’ కూడా ఇలాంటి పరిస్థితులనే ఫేస్ చేసింది. కన్నడ హిట్ ‘ఉగ్రం’కు అప్డేట్ వెర్షన్‌గా ‘సలార్’ను తీశారు ప్రశాంత్‌నీల్. కానీ ఈ సినిమా ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లు 1000కోట్లరూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించలేకపోయింది. రణ్‌బీర్‌కపూర్ ‘యానిమల్’ 900 కోట్ల రూపాయలను సాధిస్తే…ఈ సినిమా కలెక్షన్స్‌ను కూడ దాటలేకపోయింది. ఇందుకుకారణం …’సలార్’ చిత్రం ‘ఉగ్రం’కు అప్డేట్ వెర్షన్ అని ప్రచారం కావడమే. ఇలా ప్రచారం జరగడంతోనే కన్నడలో ప్రభాస్ ‘సలార్’కు కలెక్షన్స్ చాలా చాలా తక్కువ వచ్చాయి. ఈ సీన్బాలీవుడ్లో ‘లవ్ అండ్ వార్’కు రిపీట్ అయితే కష్టమే.
Prabhas: రిస్క్ చేస్తున్న ప్రభాస్?
'సీతారామం' ఫేమ్ హనురాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రభాస్‌తో హనురాఘవపూడి చేసే సినిమా బోర్డర్ లవ్‌స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Leave a comment
Leave a comment