స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా చేస్తున్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అవి ‘డీజే టిల్లు 2(DjTilluSqeare)’, ‘తెలుసు కదా (Telusukada)’, ‘జాక్(Jack)..కొంచెం క్రాక్’. సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే ఫిబ్రవరి 7. ఈ సందర్భంగా సిద్దు చేస్తున్నసినిమాల అప్డేట్స్ను ప్రకటించారు ఆయా చిత్రాల మేకర్స్. హిట్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా వస్తున్న ‘డీజే టిల్లు 2’ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ‘డిజేటిల్లు 2’కు మల్లిక్‌రామ్ డైరెక్టర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
అలాగే ప్రముఖ కాస్ట్యూమ్డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారారు ‘తెలుసు కదా’ (Telusukada) సినిమాతో. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిథి శెట్టి, రాశీఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమానునిర్మిస్తున్నారు. సిద్దు బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక దర్శకుడుబొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న తాజా చిత్రం ‘జాక్ (Jack)’. స్పై జానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’అనేది క్యాప్షన్. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ‘జాక్’ మోషన్ పోస్టర్ కూడా సిద్దు బర్త్ డే సందర్భంగానే విడుదలైంది.
ఇలా సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా మూడు గిఫ్ట్స్ అందుకున్నాడు.