టాలీవుడ్ యంగ్ హీరోస్లో ఒకరైన విశ్వక్సేన్(Vishwak Sen) లేటెస్ట్ మూవీస్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangsofgodavari) ఒకటి. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి ఓ కీలక పాత్రధారి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సోదరి, సింగర్–సంగీత దర్శకురాలు భవతారిణి ఇటీవల చనిపోయారు. దీంతో కొంత మ్యూజిక్ వర్క్ పెండింగ్‌లో పడిపోయింది. అలాగే కొంత షూటింగ్కూడా బ్యాలెన్స్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు విశ్వక్సేన్. కృష్ణచైతన్య ఈ సినిమాకు దర్శ కుడు. అయితే ఈ సినిమాను తొలుత డిసెంబరు 2023లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ మార్చి 8కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
A man's journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/hP3wqhBzFL
Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨ pic.twitter.com/8kXJa2MpGL
— TollywoodHub (@tollywoodhub8) February 7, 2024
మార్చి 8న విశ్వక్సేన్ సినిమా లేదనే అందరు అనుకున్నారు. కానీ ఈ రోజున ‘గామి’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు విశ్వక్సేన్. ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం విశ్వక్సేన్ స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో కనిపిస్తారు విశ్వక్సేన్. విద్యాధర కాగిత ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజా మార్చి 8న రిలీజ్‌డేట్‌ను ఫిక్స్ చేశారు విశ్వక్సేన్. ఇక తన సినిమాను రిలీజ్‌ను మరో సినిమాతో రిప్లేస్ చేశారు విశ్వక్సేన్. అలాగే విశ్వక్సేన్ ‘కల్ట్’, ‘లైలా’, ‘మెకానిక్రాకీ’ సినిమాలను చేస్తున్నారు విశ్వక్సేన్. వీటిలో ‘లైల’ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు విశ్వక్సేన్.