Prabhas: ‘సలార్:సీజ్ఫైర్’ సక్సెస్‌తో ప్రభాస్, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్‌తో రణ్‌బీర్‌కపూర్ మంచి జోష్‌లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి తర్వాతి సినిమాల స్టోరీలైన్ ఒకేలా ఉంటుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘సీతారామం’ ఫేమ్ హనురాఘవపూడి దర్శ కత్వంలో ఓ సినిమా రానుంది. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియా డికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. అంటే…రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో సాగే ప్రేమకథ అట ఇది. 2025లో షూటింగ్ స్టార్ట్ చేయాలను కుంటున్నారు. మరోవైపు రణ్‌బీర్‌కపూర్ హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్లో ఓ వార్ డ్రామా రూపొందనుంది. ‘లవ్ అండ్ వార్’అనేది టైటిల్. ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియాభట్, కీలక పాత్రలో విక్కీ కౌశల్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా సేమ్ రెండో ప్రపంచయుద్దం నాటి కాలం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. హనురాఘవపూడితో ప్రభాస్ చేయనున్న సినిమా, సంజయ్లీలాభన్సాలీతో రణ్‌బీర్‌కపూర్ చేయనున్న సినిమాల స్టోరీ లైన్ ఒకేటేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.