Ranbir Kapoor: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) ఫుల్‌ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఇటీవలే ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్‌కపూర్. నితీష్ తివారి దర్శకత్వంలో రానున్న ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్‌కపూర్ రాముడి పాత్రలో నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఉండనే ఉంది. ‘బ్రహ్మాస్త’ ట్రయాలజీలోని తొలిపార్టులో నటించారు రణ్‌బీర్‌కపూర్. ఈ సినిమాలో ఇంకా రెండు పార్టులు ఉన్నాయి. వీటిల్లోనూ రణ్‌బీర్‌కపూర్ ఓ హీరోగా నటించే చాన్సెస్ ఉన్నాయి. ఈ తరుణంలో రణ్‌బీర్‌కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించారు. ‘లవ్ అండ్ వార్’ (Love And War) టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియాభట్ హీరోయిన్గా నటిస్తారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరో ప్రధాన పాత్రధారి. నవంబరులో షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. 2025 డిసెంబరులో విడుదల ‘లవ్ అండ్ వార్’ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు సంజయ్‌లీలా భాన్సాలీ. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సంగతి ఇలా ఉంచితే..‘బ్రహ్మాస్త్ర’తొలిపార్టు ‘బ్రహ్మాస్త్రం: శివ’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేశారు రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి పాప జన్మించింది. ఈ పాప పేరు రాహ.