Chiranjeevi Vishwambhara: చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘విశ్వంభర’(Chiranjeevi Vishwambhara). ‘బింబిసార’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన వశిష్ట ఈ ‘విశ్వంభర’కు డైరెక్టర్. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను. సంక్రాంతి సందర్భంగా 2025, జనవరి 10న విడుదల ‘విశ్వంభర’ను విడుదల చేయనున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. కానీ ‘విశ్వంభర’ షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్లొచ్చారు చిరంజీవి.
అమెరికాలో చిరంజీవి ఏం చేశారు?
Chiranjeevi Vishwambhara: ఒక్కరోజు షూటింగ్లో జాయిన్ అవ్వకుండానే రికార్డు డీల్
ఫిబ్రవరి 18న చిరంజీవి సతీమణి సురేఖ జన్మదినం. ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహ వార్షికోత్సవం…ఈ రెండు సందర్భాలను అమెరికాలో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు చిరంజీవి. అంతేకాదు…ఇటీవల చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. దీంతో చిరంజీవిని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ అమెరికాలో ఘనంగా సత్కరించారు. ఈ మూడు వేడుకులను పూర్తి చేసుకున్న చిరంజీవి ఫిబ్రబరి 23న తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
Chiranjeevi Vishwambhara: చిరంజీవి విశ్వంభర..నిరాశలో ఫ్యాన్స్?
ఇక విశ్వంభర సెట్స్ లో…
మరో రెండు రోజుల్లో చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్‌లో జాయిన్ అవుతారు. ఈ కొత్త షెడ్యూల్ మార్చి 18 వరకు సాగుతుందని తెలిసింది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో త్రిష కూడా జాయిన్ అయ్యారు. ‘స్టాలిన్’ సినిమా తర్వాత అంటే 18 సంవత్సరాల తర్వాత చిరంజీవి, త్రిషలు కలిసి మళ్లీ విశ్వంభర కోసం వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవికి ఈ సినిమాలో ఐదుగురు సిస్టర్స్ ఉంటారట. వీరిలో ఒకరు హీరోయిన్ సురభి. మిగిలిన సిస్టర్స్ పేర్లలో మృణాల్‌ఠాకూర్, మీనాక్షీ చౌదరి, శ్రీలీల వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ‘విశ్వంభర’కు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.