Akaay: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్కాశర్మ (Anushka Sharma) దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. విరాట్, అనుష్కాశర్మలు తాజాగా ఓ బాబుకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న అనుష్కాశర్మ బేబీ బాయ్‌కి జన్మనిచ్చినట్లుగా విరాట్‌కోహ్లీ వెల్లడించారు.
Virat Kohli & Anushka Sharma are blessed with a baby boy – "Akaay".#ViratKohli #Anushkasharma https://t.co/2iMgl2VbMJ
— TollywoodHub (@tollywoodhub8) February 20, 2024
అలాగే ఈ బాబుకు ‘అకాయ్’(Akaay) అని పేరు పెట్టినట్లు, అభిమానులు, ప్రజల ఆశీర్వాదాలు కోరుకుంటున్నట్లుగా కోహ్లీ ఓ పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక విరాట్ – అనుష్కా దంపతులకు ఆల్రెడీ కుమార్తె వామిక ఉన్నారు. 2021 జనవరి 11న వామిక జన్మించింది. ఇకఇక 2017లో ఇటలీలో అనుష్కాశర్మ– విరాట్ కోహ్లీల (విరుష్కా) వివాహం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.