Prabhas The Rajasaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘రాజా సాబ్’ టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ రొమాంటిక్ హారర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ల పేర్లు వినిపించాయి. అలాగే బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఈ సినిమాలో ఓ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్, సంజయ్‌దత్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.
తప్పుగా ప్రభాస్ పేరు
‘రాజా సాబ్’ సినిమా పోస్టర్లో ప్రభాస్ పేరులో ఎక్స్ ట్రా ఒక ‘ఎస్’ వచ్చింది. దీంతో న్యూమరాలజీ ప్రకారం ప్రభాస్ పేరు మార్చుకున్నారెమో అని అందరు అను కున్నారు. తీరా జరిగింది ఏంటంటే… పొరపాటున ప్రభాస్ పేరులో ఒక ‘ఎస్’ కలిసిందట. అంతేకానీ ప్రభాస్ పేరు మారలేదని తెలిసింది.
అందుకే రాజాసాబ్ టైటిల్ పెట్టారా?
ఈ సినిమాకు తొలుత ‘రాజా డీలక్స్’, ‘అంబాసిడర్’ వంటి టైటిల్స్ కూడా వినిపించాయి. అయితే ఫైనల్‌గా ‘రాజా సాబ్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘రాజా సాబ్’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. సో…అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఒకే టైటిల్‌ను ఫిక్స్ చేసిన ట్లున్నారు మేకర్స్. ఇక ‘రాజా డీలక్స్’ అనే ఓ థియేటర్లో జరిగే కొన్ని హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలిసింది