JrNTR-Ramcharan: టాలీవుడ్లో నిజమైన పీపుల్ స్టార్ దర్శక–నిర్మాత, నటులు ఆర్. నారాయణమూర్తి (R.Narayanamurthy). ఆయన సినిమాల్లో వ్యాపారకోణం కన్నా..సమాజ శ్రేయస్సుకే ఎక్కువ విలువ ఇస్తుంటాయి. యాక్టింగ్‌లో కూడా అంతే. అందుకే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో మంచి పారితోషికంతో ఆఫర్లు, అవకాశాలు వచ్చిన ఆర్. నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో సినిమాకు ఆయన నో చెప్పినట్లుగా ఫిల్మ్‌నగర్ వాసులు మాట్లాడుకుంటున్నారు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన ఓ సిని మా చేస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధిమూవీస్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా ఆల్మోస్ట్ ఫిల్మ్ అయ్యారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్ చేయనున్నారని తెలిసింది. అయితే కథ రిత్యా రామ్‌చరణ్‌కు ఓ కోచ్ కావాలి. ఈ పాత్రను ముందుగా ఆర్. నారాయణమూర్తికి ఆఫర్ చేశారట బుచ్చి బాబు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఈ పాత్రకు కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ను తీసుకున్నారని సమాచారం.
గతంలో పూరీ జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పోసానీ కృష్ణమురళీ చేసిన పాత్రను ముందుగా ఆర్. నారాయణమూర్తికి ఆఫర్ చేశారు పూరీ జగన్నాథ్. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఎన్టీఆర్‌కు పరోక్షంగా నో చెప్పారు ఆర్. నారాయణమూర్తి. ఇప్పుడు రామ్‌చరణ్‌కు నో చెప్పారు. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ హీరోలకు ‘నో’ చెప్పే దమ్ము, ధైర్యం కూడా పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తికే ఉంటాయనుకోవడంలో సందేహాం లేదు.
NTR With Prabhas: ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్?
Ramcharanmovies:ఎన్టీఆర్…అల్లు అర్జున్‌ల కథలను టేకోవర్ చేస్తున్న రామ్‌చరణ్?