Ramcharanmovies: బాలీవుడ్లో ‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాలను తీసే దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ (Sanjayleelabhansali). ఈ దర్శకుడితో రామ్‌చరణ్ (Ramcharan) ఓ సినిమా చేయనున్నారనే వార్త బాలీవుడ్లో వినిపిస్తోంది.
అయితే 2022 మార్చి 14న (అంటే..‘పుష్ప: ది రైజ్’ రిలీజై, అల్లు అర్జున్ మంచి సక్సెస్ జోష్‌లో ఉన్న సమయంలో అన్నమాట) సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు అల్లు అర్జున్(Alluarjun). దీంతో సంజయ్‌లీలా భన్సాలీ, అల్లు అర్జున్కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఈ కాంబోను గురించిన మరో అప్డేట్ తెరపైకి రాలేదు. ఇప్పుడు సంజయ్‌లీలాభన్సాలీ, రామ్‌చరణ్ కాంబినేషన్లో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్‌కు చెప్పిన కథనే సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌చరణ్‌కు చెప్పారా?అనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే…అల్లు అర్జున్ చేయాల్సిన కథను రామ్‌చరణ్ చేస్తున్నట్లే కదా!
Yatra2 movie Review: యాత్ర 2 మూవీ రివ్యూ
ఇక ‘ఉప్పెన’ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్(NTR)తో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయాలని ఓ కథను రెడీ చేసుకున్నారు బుచ్చిబాబు(Buchhibabu). సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో..’ సినిమాను ఎన్టీఆర్‌తో తీసే సమయంలోనే ఈ కథను బుచ్చిబాబు ‘నాన్నకు ప్రేమతో…’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్‌కు వినిపించారట. ఆ సమయంలో సుకుమార్ ఫెవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న బుచ్చిబాబు కథను విన్నారట ఎన్టీఆర్. ఆల్మోస్ట్ గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారు.
ఏమైందో ఏమో కానీ..ఈ కథ మెగా కాంపౌడ్‌లోకి వచ్చింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబుదర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు. అలా ఎన్టీఆర్ చేయాల్సిన కథ రామ్‌చరణ్‌కు చేరింది. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే…ఈ సినిమాకు మొదట మైత్రీమూవీ మేకర్స్ ప్రధాన నిర్మాతలు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌చేంజర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు సిద్ధం అవుతోంది.