NTR With Prabhas:
మహానటి..దివంగత ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం. ఈ చిత్రం కోసం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామరావు పాత్రల్లో ఎవరు నటిస్తారు? అనే చర్చ అప్పట్లో ఓ హాట్ టాపిక్. నాగేశ్వరరావు పాత్రకు సుమంత్‌ను తీసుకున్నారు. అయితే నందమూరి తారకరామరావు
పాత్రను ఎన్టీఆర్ పోషిస్తారనే టాక్ బాగా వినపడింది. కానీ ఎన్టీఆర్ చేయలేదు. ఈ సినిమా కోసం నాగ్
అశ్విన్ కొంత పాత ఫుటేజ్ వాడగా, ఒకట్రెండు సన్నివేశాల్లో సీనియర్ ఎన్టీఆర్‌గా సూర్య శ్రీనివాస్ కనిపించారు. వైజయంతిమూవీస్పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘మహానటి’.
వైజయంతీమూవీతో సీనియర్ ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. అశ్వనీదత్ నిర్మాణసంస్థను ప్రారంభిస్తున్నాం అన్నప్పుడు వైజయంతీమూవీస్ అని నామకరణం చేసింది సీనియర్ ఎన్టీఆర్. వైజయంతీ మూవీస్ జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అనే భారీ బడ్జెట్ సినిమా తీసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
అసలు…ఇప్పుడు వైజయంతీమూవీస్, జూనియర్ ఎన్టీఆర్‌ల ప్రస్తావన ఎందుకు అంటే…ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా కోసం. మహానటి వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాను. అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనె, దిశాపటానీ, మలయాళ నటి అన్నాబెన్, కమల్‌హాసన్ ప్రధాన పాత్రల్లో, రాజమౌళి, విజయ్‌దేవరకొండ, దుల్కర్సల్మాన్, నాని ఈ సిని మాలో కీ రోల్స్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ను కూడా ‘కల్కి 2898ఏడీ’లో భాగం చేయాలన్నది నాగ్ అశ్విన్ ప్లాన్. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్‌కు లాభించిన ఇమేజ్ను కూడా ఈ సినిమాకు ఉపయోగపడొచ్చు అనేది చిత్రంయూనిట్ ఆలోచన(NTR With Prabhas) వైజయంతీమూవీస్లో సినిమాలు చేసిన నాని, విజయ్‌దేవరకొండ, దుల్కర్సల్మాన్ ఈ సినిమాలో భాగం అయ్యారు. మరి…ఎన్టీఆర్ కూడ నటిస్తారా? ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే.. అది ఏ రేంజ్లో ఉంటుంది? అనేది చూడాలి.