బాలీవుడ్లో అజయ్‌దేవగన్ హీరోగా నటించిన ‘రైడ్’ ఫిల్మ్ 2018లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ‘రైడ్’ సినిమా తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’గా రీమేక్ అవుతోంది. ‘నామ్ తో సునా హోగా!’ అనేది ఉపశీర్షిక. రవితేజ హీరోగా నటిస్తారు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్‌శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్‌ల సమ ర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనేఈ సినిమాచిత్రీకరణ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. ఇక రవితేజ నటించిన మరో చిత్రం ‘ఈగిల్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.
రైడ్ రీమేక్‌లో రవితేజ
Leave a comment
Leave a comment