వరుస పరాజయాల తర్వాత నాగచైతన్య సంతకం చేసిన తాజా సినిమా ‘తండేల్’. ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత దర్శకుడు చందూమొండేటితో కలిసి నాగచైతన్య చేస్తున్న సినిమా ఇది. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అల్లు అర్జున్ గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి మళ్లీ ఈ సినిమా కోసం జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నాగార్జున, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.
తండేల్ సినిమా చిత్రీకరణ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. 2018లో గుజరాత్ తీరప్రాంతంలో పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులకు బందీలుగా దొరిక విజయనగరం, శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ‘తండేల్’ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తారు నాగచైతన్య. గతంలో నాగచైతన్య, శివ నిర్వాణ కాంబోలో ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ వచ్చిన సంగతి తెలిసిందే.
pygmies xyandanxvurulmus.97MABrIPjfqO