‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తర్వాత హీరో యష్ చేయబోయే తర్వాతి సినిమాను గురించి చాలా ఉహాగానాలు వినిపించాయి. నితీష్ తివారం, రవి ఉడయార్ దర్శకద్వయం రామాయణ ఇతీహాసం ఆధారంగా తెరకెక్కించనున్న సినిమాలో యశ్ రావణుడిగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఆ తర్వాత కన్నడ దర్శకుడు నార్తన్ (మఫ్తీ) ఫేమ్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేరు వినిపించింది. అయితే ఫైనల్‌గా యష్ సినిమా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలోనే ఖరారైంది. ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ పెట్టారు. 2025, ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
yash Toxic: యష్ టాక్సిక్
Leave a comment
Leave a comment