Akhil Agent: అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28, 2023లో విడుదలైంది. దర్శకుడు–రచయిత వక్కంతం వంశీ కథతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. కాగా ఈ సినిమా కథకు దాదాపురెండు కోట్ల రూపాయలను పారితోషికంగా వక్కంతం వంశీకి ఇచ్చారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
అయితే 80 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్‌కూడా సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా వైఫల్యంపై ఈ చిత్రం నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ‘‘ఏజెంట్’ సినిమా వైఫల్యానికి పూర్తి బాధ్యతమాదే (తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థను ఉద్దేశిస్తూ..). బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్‌ను స్టార్ట్‌చేశాం. ఆ తర్వాత కోవిడ్ వల్ల మాకు ఎదురైన మరికొన్ని సమస్యలు కూడా మమ్మల్నీ ఇబ్బందిపెట్టాయి. ‘ఏజెంట్’ ఫలితం ఆశించినట్లుగా రాలేదు. ‘కాస్ట్లీ మిస్టేక్’గా ‘ఏజెంట్’ ప్రాజెక్ట్ నిలిచింది. ఈతప్పు నుంచి పాఠాలు నేర్చుకున్నాం. భవిష్యత్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు వహిస్తాం’’ అంటూ అనిల్‌సుంకర ట్వీట్ చేశారు.
అనిల్ సుంకర ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఏజెంట్ రిజల్ట్విషయంలో అఖిల్ మిస్టేజ్ పెద్దగా లేదని తెలిసి పోతుంది. అలాగే అనిల్ చేసిన ఈ స్టేట్మెంట్తో తప్పుఅంతా ఇప్పుడు దర్శకుడు సురేందర్‌రెడ్డి, రచయిత వక్కంతం వంశీలపైకి వెళ్లినట్లుగా తెలుస్తుంది.