Ramcharan: దర్శకుడు రాజమౌళితో ఓ హీరో సినిమా కమిటైయ్యాడంటే చాలు. ఈ సినిమా విడుదల తర్వాతే ఆ హీరో మరో సినిమా చేస్తాడు. రాజమౌళి (Rajamouli) కూడా అలానే ఆ హీరోతో మాట్లాడుకుంటాడు. కానీ రామ్‌చరణ్ విషయంలో మాత్రం రాజమౌళి లెక్కతప్పిందనుకోవాలి. రామ్‌చరణ్‌తో రాజమౌళి తొలిసారి ‘మగధీర’ సినిమా చేశాడు. ఆ సమయంలో ఒకే. కానీ మళ్లీ రామ్‌చరణ్‌తో రాజమౌళి చేసిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం). ఈ సినిమా సమయంలో మాత్రం రామ్‌చరణ్ కాస్త ముందుచూపుతోనే వ్యవహరించాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల కావడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుందని ముందు గానే ఊహించినట్లు ఉన్నాడు రామ్‌చరణ్.
ఆడియన్స్‌కు తనకు గ్యాప్ రాకూడదని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమా ‘వినయవిధేయరామ’ రిలీజ్‌ను ప్లాన్ చేశాడు. రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆడియన్స్‌ను ఓ సారి థియేటర్స్‌లో చూశారు ఆడియన్స్. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్‌పై ఉండగానే మరోసారి రామ్‌చరణ్ కనిపించాడు అది ‘ఆచార్య’తో సినిమా. రిజల్ట్ తేడా కొట్టింది. కానీ ఆడియన్స్‌కు కనిపించారు రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చి 25, 2022 విడుదలైంది. మరోసారి ‘ఆర్ఆర్ఆర్’తో వెండితెరపై కనిపించాడు రామ్‌చరణ్. ఈ సారి రిజల్ట్ బ్లాక్‌బస్టర్. అనకున్నట్లుగానే రామ్‌చరణ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్.. దర్శకుడు శంకర్‌తో ‘గేమ్‌చేంజర్’కు కమిటైయ్యాడు. ఈ సినిమా విడు దలకు రెడీ అవుతోంది. బుచ్చిబాబుతో మరో సినిమా కమిటైయ్యాడు రామ్‌చరణ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటం టే…‘ఆర్ఆర్ఆర్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్ కథ విన్నాడు రామ్‌చరణ్. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే….‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే సుకుమార్ కథను రామ్‌చరణ్ ఒకే చేశాడని రాజమౌళికి తెలుసు. ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్‌ను గురించి కూడా రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. ఇలా రాజమౌళి లెక్కకు అందకుండ ఆడియన్స్‌కు ఎప్పటికప్పడు థియేటర్స్‌లో కనిపిస్తూ, కొత్త సినిమాలకు కమిటవుతూ, సూపర్ అనిపించాడు రామ్‌చరణ్.