FamilyStar: విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీస్టార్’ (FamilyStar) సినిమా షూటింగ్ పూర్తయింది. మృణాల్‌ఠాకూర్ హీరోయిన్గా నటించారు. పరశురామ్ డైరెక్టర్. ‘గీతగోవిందం’ తర్వాత విజయ్‌దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. అజర్‌బైజాన్‌లోని బాకు లొకేషన్స్‌లో ఓ సాంగ్‌ను చిత్రీకరించడంతో ఈ సినిమా ముగిసినట్లుగా తెలిసింది. దిల్ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది.
గెస్ట్‌గా రష్మికా మందన్నా?
విజయ్‌దేవరకొండ, రష్మికామందన్నాలు కలిసి ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించారు. తాజాగా ఫ్యామిలీస్టార్‌లో రష్మికా మందన్నా ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ తెరపైకి వచ్చింది. ‘ఫ్యామిలీస్టార్’ సినిమా డెహ్రా డూన్లో షూటింగ్ జరిగింది. ఓ వెడ్డింగ్ సాంగ్‌ను తీశారు. ఈ సాంగ్‌లోనే రష్మికా గెస్ట్ రోల్లో కనిపిస్తారని తెలి సింది.
ఫ్యామిలీస్టార్ షూటింగ్ పూర్తయింది. సో..నెక్ట్స్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేస్తారు విజయ్‌దేవరకొండ. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.