FamilyStar Review: హీరో విజయ్‌దేవరకొండ కెరీర్లో వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్ పేట్ల. కాగా విజయ్, పరశురామ్‌ల కాంబినేషన్లో తాజాగా రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం నేడు థియేటర్స్‌లో విడుదలైంది. మరి…‘ఫ్యామిలీస్టార్’ (FamilyStar Review) ప్రేక్షకులను మెప్పించాడా? చూద్దాం.
సినిమా: ఫ్యామిలీస్టార్ (FamilyStar Review)
ప్రధాన తారాగణం: విజయ్‌దేవరకొండ, మృణాల్‌ఠాకూర్
దర్శకుడు: పరశురామ్పేట్ల
నిర్మాత: ‘దిల్’ రాజు, శిరీష్
సంగీతం: గోపీసుందర్
ఎడిటర్: మార్తాడ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
నిడివి: 2 గంటల 43 నిమిషాలు
జానర్: రొమాంటిక్ ఫ్యామిలీఎంటర్టైనర్ (U/A Certified)
విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024
కథ
ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు గోవర్థన్. మిగిలిన ఇద్దరు అన్నయ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండ టంతో గోవర్థన్ ఇంటి పూర్తి బాధ్యతను తీసుకుంటాడు. ఇద్దరు అన్నయ్యలు, వారి భార్యలు, అన్నయ్య – వదినల వారసులు (నలుగురు పిల్లలు), ఓ భామల వీరందరి జీవనాధారం గోవర్థనే. తన ఆర్కిటెక్ట్ ఉద్యోగం చేసుకుంటూ జాగ్రత్తగా ఇంటి బాధ్యతలను మోస్తుంటాడు. ఈ తరుణంలో గోవర్థన్ ఇంటి పై పోర్షన్లోకి ఇందు వస్తుంది. మెల్లిగా గోవర్థన్ ఫ్యామిలీకి దగ్గర అవుతుంది. మొదట్లో ఇందును కాస్తపక్కన పెట్టినా, మెల్లిగా ఇందు ప్రేమలో పడిపోతాడు గోవర్థన్. ఇక ఇందుకు తన ప్రేమను బహిర్గతం చేద్దామనుకుంటున్న తరుణంలో ఆమె గురించి గోవర్థన్‌కు ఓ నిజం తెలుస్తుంది. దీంతో ఇందుపై ద్వేషంపెంచుకుంటాడు గోవర్థన్. ఈ క్రమంలోనే మూడులక్షల జీతం ఉద్యోగం లభించే ఓ మల్టీనేషనల్ కంపెనీలోజాయిన్ అవుతాడు గోవర్థన్. ఆ కంపెనీ సీఈవో ఇందు. అసలు…గోవర్థన్‌కు ఇందు ఎందుకు దగ్గర కావాలనుకుంది? ఇందు గురించి తెలిసిన తర్వాత కూడా ఆమె కంపెనీలోనే గోవర్థన్ ఎందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది? అనేది ఈ చిత్రం కథ.
విశ్లేషణ
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఓ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ కథను ‘ఫ్యామిలీస్టార్’గా చెప్పాలనుకున్నాడు దర్శకు డు. కానీ హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండి, నెలకు లక్ష రూపాయల జీతం తీసుకునే గోవర్థన్ ఏలాంటి మధ్య తరగతి వాడో చెప్పడంలో దర్శకుడు విఫలమైయ్యాడు. మల్టీనేషనల్ కంపెనీ సీఈవో ఇందుకు మిడిల్ క్లాస్ థీసెస్ ఎందుకు రాయాల్సి వచ్చిందో, అందుకు ఆమె గోవర్థన్నే ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందో అన్న కారణాలను విశదీకరించడంలో దర్శకుడు నిర్లక్ష్యం కనిపిస్తుంది.
బడ్జెట్ తగ్గింపులో భాగంగా తక్కువ ధరలో ఉల్లిపాయలు కొంటాడు గోవర్థన్. నెలలో ఒకరోజు మాత్రమే మాంసాహారం ఇంట్లో వండాలి. ఇలాంటి కండీషన్స్ పెట్టుకున్న గోవర్థన్…కేవలం ఇందుపై కోపంతో కోటి రూపాయల లోన్ తీసు కోవడం, ఓ దశలో ఆ లోన్‌ను తీర్చేందుకు ఇంటిని అమ్మేస్తాను అనడం…వంటి అయితే ….కథనంలో ఎంతటి లోటుపాట్లు ఉన్నాయో అర్థం అవుతుంది. తన తప్పులు, అవసరాలు, ద్వేషాల కోసం గోవర్థన్ ఇంటిని అమ్మేసే వాడు ఏ రకం ఫ్యామిలీస్టారో అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గోవర్థన్, ఇందుల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ సాదాసీదాగా ఉంటుంది. మధ్యలో ఏదో భారతీయ సంప్రాదాయం, విలు వలు అంటూ ఏదో ప్రయత్నం. కానీ అదీ అర్థరహితమే. ఫైట్స్ అయితే…కమర్షియాలిటీ కోసం ఇరికించినట్లుగా ఉంటాయి. పాటలు అంతే. పెద్ద సౌండ్ చేయలేదు. కళ్యాణీ సాంగ్ రోలింగ్ టైటిల్స్‌తో వస్తుంది. అయితే విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్, కొందరు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చవచ్చెమో. ఇంట్రవెల్ బాగుంటంది. సో..సెకండాఫ్ బాగోదు. క్లైమాక్స్ కూడా రోటీన్.
నటీనటులు
గోవర్థనగిరిని మోసిన ఆ గోవర్ధునుడి తరహాలో ‘ఫ్యామిలీస్టార్’ సినిమాను మోసాడు విజయ్ దేవర కొండ. విజయ్ స్టైల్ ఆఫ్ ఈజ్, యాక్టింగ్ కనిపిస్తుంది. కానీ గోవర్థన్ పాత్రలో బలం లేదు. కాబట్టి విజయ్ యాక్టిం గ్ ఈ సినిమాకు సరిపోలేదు. సీతారామం, హాయ్‌నాన్న సినిమాల్లో మృణాల్‌ఠాకూర్ బలమైన, బరువైన పాత్రలు చేశారు. కానీ ఈ సినిమాలో ఆమె చేసిన ఇందు పాత్రకు ఆ స్కోప్ లేదు. ఎక్కువ ఎక్స్ప్రేషన్స్తోనే సరిపెట్టింది మృణాల్ ఠాకూర్. ‘గీతగోవిందం’ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. రోల్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.
కానీ ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్రకు నవ్వు రాదు. కథపై ఇంపాక్ట్ చేసే రోల్ కూడా కాదు. జగపతిబాబు పాత్ర రోటిన్ డైలాగ్స్‌తోనే సరిపోతుంది. రోహిణి పాత్ర కూడా అంతంత మాత్రమే. గోపీసుందర్ స్థాయి పాటలు ఈ సినిమాలో వినిపించవు. గీతగోవిందం మ్యాజిక్ ఆశిస్తే నిరాశే మ్యూజిక్ పరంగా. కెమెరా ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్‌తోనే స్టోరీని పూర్తి చేయవచ్చు. కానీ క్లైమాక్స్‌లో ఫైట్ కావాలన్నట్లుగా కథను ముందుకు జరిపి,
ఈ ఫైట్ కోసం అమెరికాలో మరో పెట్టి ఏంటో అంతా వింత. ఆడియన్స్‌కు చింత.